కరోనా తగ్గుముఖం పట్టిన క్రమంలో ఇప్పుడిప్పుడే దర్శన నిమిత్తం భక్తుల సంఖ్యను పెంచుతున్నారు. సూర్య జయంతి సందర్భంగా ఈనెల 19న శ్రీవారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) రథ సప్తమి ఉత్సవాన్ని నిర్వహించబోతోంది. ఆ రోజు శ్రీ మలయప్ప స్వామి 7 వాహనాలపై ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.