త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవుని భార్యా సరస్వతీ దేవి చదువుల తల్లి ఈ ఆమ్మవారి వాహనం హంస, నెమలి. వేదాలు, పురాణాలలో విపులంగా సరస్వతీ దేవి గురించి ప్రస్తావించబడింది. కొన్ని పురాణ గాథలు సరస్వతీ దేవి,అమ్మవారి పేరుతొ సరస్వతీ నది అని కుడా ఉంది. శరన్నవరాత్రి, వసంత పంచమి ఉత్సవాలలో సరస్వతీదేవి ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది. ఋగ్వేదంలోనూ, దేవీ భాగవతంలోనూ, బ్రహ్మ వైవర్త పురాణంలోనూ (2.6.13-95), పద్మ పురాణంలోనూ సరస్వతి గురించి వివిధ గాథలున్నాయి. సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు.



బ్రహ్మ సకల సృష్టి కర్త గనుక సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడనీ ఒక గాథ. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతా దేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతున్నది. అక్టోబరు 5 , శనివారం రోజు సప్తమి తిధి రోజు మూలా నక్షత్రం ఉన్నది కావునా ఆరోజు సరస్వతి ఆమ్మ వారిని పూజిస్తే తల్లి అనుగ్రహం కలుగుతుంది.మనకు ముఖ్యమైన దేవతా మూర్తులలో సరస్వతిదేవి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. ఈ దేవి
సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక గాథ. వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు.




ఈ అమ్మవారు అధికంగా హంస వాహినిగా, వీణా పాణిగా, పుస్తకం మాలా ధారిణిగా చిత్రింపబడుతుంది. సరస్వతి వర్ణనలలో తెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సారస వాహినీ శుభాకారత నొప్పు"నది గా బమ్మెర పోతన తన సరస్వతీ స్తుతిలో తెల్ల వస్తువుల పెద్ద జాబితానే ఉట్టంకించాడు. సరస్వతి ధరించే వీణ పేరు"కచ్ఛపి. సరస్వతి అమ్మవారిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక గాథ. వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: