మోక్ష సాధనకు మరియు ఆధ్యాత్మిక పరిపూర్ణతకు కొద్దిమంది సన్యాసాన్ని స్వీకరిస్తారు. సన్యాసాన్ని స్వీకరించిన వారు, నిరాడంబర జీవనం, బ్రహ్మచర్యం, ఐహిక సుఖములపై అనాసక్తి, భగవంతునిపై నిశ్చల భక్తిని తమ జీవన విధానంగా మలుచుకుంటారు. వీరిని సన్యాసులు, సాధుపుంగవులు, లేదా స్వాములని పిలుస్తాం. ఈ సన్యాసుల పట్ల సమాజం అత్యంత భక్తి  కలిగి ఉంటుంది. ఎందువల్లనంటే వారు స్వార్థం,  ఇంద్రియ సుఖములందు అనాసక్తులై,  ఆశ్రమాల్లో తమ జీవనం కొనసాగిస్తుంటారు.


సన్యాసులు, సాధువులు, పేద-ధనిక, మంచి-చెడు, తేడా లేకుండా అందరిపై సమదృష్టి కలిగి ఉండే వీరు. పొగడ్తలకు, నిందలకు, సంతోషాలకు, భాధలకు చలించకుండా ఉండాలని ప్రయత్నిస్తుంటారు. కాని అఘోరాలు మాత్రం తమ అవసరాలను ఆ సర్వేశ్వరుడే తీరుస్తున్నాడని, ఈ దేహం తమది కాదని ఆ ఈశ్వరుని వరంగా బావించి హిమాలయాలు, కాశి వంటి పుణ్యక్షేత్రాల్లో నివసిస్తూ నిరంతరం శివద్యానంలో వుంటారు. ఇకపోతే వీరు కనిపించడం కూడ చాల తక్కువ. వీరి జీవన విదానాన్ని ఒకసారి పరిశీలిస్తే, శ్మశానాలలో, జీవించటం, పూజలు, ప్రాణాయామం, తపస్సులు  నిర్వహించటం.  కాలిన శవాల బూడిదను విభూతిగా బావించి, ఒళ్ళంతా రాసుకోవటం, పుర్రెను, ఆహారంగా స్వీకరించే, పాత్రగా వినియోగించటం, అదే పుర్రెలో జంతువులక్కూడ ఆహారదానం చేయటం చేస్తారు.,


పొడవాటి ఎముకలను దండంగా వినియోగించటం, మానవ కళేబరాలను ఆహారంగా భుజించటం, ఇవి వీరి జీవితం లోని చర్యలు. ఇక ఒంటిపైన ఒక్క నూలుపోగు కూడ లేకుండా ప్రతికూల వాతవరణంలో సైతం జీవించడం వీరిప్రత్యేకత. శరీరం బిగుసుకుపోయే చలిలో సైతం వీరి నివాసం,శవాలతో సావాసం. శివుడు, ఇతర దేవతలు ధరించినట్లు వీరు పుర్రె, ఎముకలను ధరిస్తారు. ఇకపోతే అఘోరాల జీవనసరళి, ఆచార వ్యవహారాలు  భయానకంగా ఉంటాయి...సభ్యసమాజానికి దూరంగా ఉండటం కారణంగానో లేక , సన్యాసం వల్లో, వీరు చేసే తపస్సుల వలన రోగాలను నయం చేసే మంత్రశక్తులు ఉన్నాయనే నమ్మకం ప్రజల్లో ఉంది. అందుకే వీరిని కొందరు దైవ స్వరూపులుగా కూడ భావిస్తారు..


మరింత సమాచారం తెలుసుకోండి: