తెలుగు లోగిళ్లలో అతిపెద్ద పండగ సంక్రాంతి. దేశంలో కూడా వివిధ పేర్లతో ఈ సంక్రాంతిని జరుపుకుంటారు. ఒక్కో రాష్ట్రంలో ఓక్కో పేరుతో ఈ పండుగను పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి విశిష్టతే వేరు. ఈ పండగకు చేసుకునే సంబరాలు మరే పండగకు జరగవు. ఒక్కో ప్రాంతంలో ఒకో విధమైన సంప్రదాయాలతో ఈ పండగ విశిష్టత ఉంటుంది. ప్రజలంతా సుఖ:సంతోషాలతో ఈ పండగ సంబరాల్లో పాల్గొంటారు. సంప్రదాయాలకు విలువిచ్చే ఈ పండగను పలు విధాలుగా సంబరాలు జరుగుతాయి.

 

 

గోదావరి జిల్లాల్లో కోళ్ల పందాలు ఎంత వైభవంగా జరుగుతాయో తెలిసిందే. కేవలం పండగ మూడు రోజుల్లోనే వందల కోట్లలో పందాలు జరుగుతాయి. కొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పందాలు, పొట్టేళ్ల పందాలు కూడా జరుగుతాయి. ఇవి ఎన్నో ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం. కోర్టు తీర్పులకు అతీతంగా కూడా ఈ పందాలు జరిగిని సందర్భాలు ఉన్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఎక్కువమంది వివిధ ప్రాంతాల నుంచి గోదావరి జిల్లాలకు వస్తూంటారు. కోడి పందాలంతా ఒక ఎత్తైతే ఎన్నడూ ఎరుగని సరికొత్త పందాలకు అనంతపురం జిల్లా వేదికైంది. ఇక్కడ సరికొత్తగా పందుల పోటీలు నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని టెలిఫోన్‌ ఎక్సేంజి వద్ద ఉన్న మైదానంలో ఈ పందుల పోటీలు నిర్వహించారు. ఆ ప్రాంతవాసులకే కొత్తగా అనిపించిన ఈ పోటీలను స్ధానికులు ఆసక్తిగా తిలకించారు.

 

 

మన రాష్ట్రంతోపాటు తమిళనాడులో కూడా ఈ సందర్భంలో పోటీలు జరుగుతాయి. జల్లికట్టు పేరుతో అక్కడ జరిగే ఎడ్ల పందాలు కూడా సంప్రదాయంగా వస్తున్నాయి. జల్లికట్టుపై తమిళనాట మొత్తం ఆసక్తి నెలకొంటుంది. మనకు మాత్రం ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా నిర్వహిస్తూంటారు. అందులో భాగంగానే కోళ్ల, ఎడ్ల, పొట్టేళ్ల పందాలు. కానీ.. ఇలా పందుల పోటీలు కూడా నిర్వహించడం మాత్రం ఇదే తొలిసారి అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: