ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్క జీవి ఏదో ఒక సమయంలో కష్టాలను ఎదుర్కొంటారు. అది పని సంబంధించి కావచ్చు.. పరీక్షలలో ఫెయిల్ అవ్వడం.. ప్రేమలో విఫలమవ్వడం.. ఆర్థిక పరంగా.. ఆరోగ్య పరంగా.. కుటుంబ పరంగా.. సామాజిక పరంగా.. ఇలా ఏదో ఒక విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ.. మనం వాటన్నింటినీ అధిగమించి ముందుకు ఎలా వెళ్లాలి అనేది కేవలం మన చేతుల్లోనే ఉంటుంది.అయితే ఇలా జీవితంలో విజయం సాధించేందుకు అవసరమయ్యే రహస్యాలను ఆ పరమేశ్వరుడు వెల్లడించారు. అందరికీ ప్రేరణ కలిగించే ఆ దేవుని బోధనలు ఎంతో పవిత్రమైనవి.

పురాణాల ప్రకారం శివుడు.. తన భాగస్వామి అయిన పార్వతీదేవితో తరచుగా ఈ విషయాల గురించి ఎక్కువగా చర్చించేవారట. అందులో పార్వతీదేవికి శివుడు చెప్పిన రహస్యాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇవి మన జీవితంలో విజయం సాధించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. మనం చేసే ప్రతి పనిలో పట్టుదల మరియు సంకల్పం ఉన్నంతవరకు, మనం వాటిని మరింత మెరుగ్గా చేయగలం. ఏదైనా ప్రయత్నం బాగా జరగాలని మీరు కోరుకుంటే, మీరు మనస్సులో దృఢమైన నిబద్ధత కలిగి ఉండాలి. సంకల్పం తప్ప మరేది అవసరం లేదు.

సమాజం మీ గురించి కొన్ని మంచి లేదా చెడు విషయాలను కచ్చితంగా చెబుతుంది. అయితే సమాజంలోని కొందరు చెప్పే మంచి విషయాల వల్ల మీలో అహం పెరగొచ్చు. వారు చెప్పే చెడు విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఈ రెండూ మీ పతనానికి దారి తీస్తాయి. అందుకే ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో చూసి కలవరపడటం మానేయాలి. సమాజంలోని కొందరు మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తినా.. వినయంగా ఉండాలి. వాటిని అతిగా నమ్మకండి. అప్పుడే మీ లక్ష్యాలపై మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టగలరు. మీకు గురువులతో ఉన్న సంబంధం మంచిది అయినా.. చెడ్డది అయినా, వారిపై ఎప్పుడూ మీరు గౌరవం కలిగి ఉండాలి. వారు మీకు నేర్పిన పాఠాలు పరీక్షల్లో రాకపోయినా.. జీవితంలో మాత్రం కచ్చితంగా ఉపయోగపడతాయి. వారి సహాయం మరియు మార్గదర్శకత్వం వల్లనే మనం ముందుకు సాగే అవకాశం ఉంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: