స్వర్గానికి మెట్లు ఉన్న ఆలయం మన దేశంలో  ఒకటి ఉందని అందరు వినే ఉంటారు. ఈ  దేవాలయంలో స్వర్గానికి మెట్లు పాండవులు నిర్మించారని ప్రతీతి. దేశంలోనే అత్యంత  ప్రాచీనమైన దేవాలయాలలో "బథూ కి లాడి" దేవాలయం కూడా ఒకటి.   హిమాచల్ ప్రదేశ్ లోని  కాంగ్రా జిల్లాలో ఈ దేవాలయం ఉంది. ప్రస్తుతం ఈ దేవాలయం మహారాణాప్రతాప్ సాగర్ డ్యామ్  జలసమాధిలో ఉంది. కేవలం నాలుగు నెలలు మాత్రమే ఈ ఆలయం భక్తులకు దర్శనమిస్తుంది. మిగిలిన 8 నెలల పాటు నీటిలో మునిగిపోయి ఉంటుంది.  ఈ దేవాలయాన్ని చూడాలనుకునే పర్యాటకులు పడవల్లో ఆలయానికి చేరుకోవాల్సి  ఉంటుంది. ఈ దేవాలయంలో ఒక రహస్యం దాగి ఉందని మన పురాణాలు చెబుతున్నాయి. పౌరాణిక కథల ప్రకారం ఈ ఆలయంలో స్వర్గానికి వెళ్లే మెట్లు ఉన్నట్లు  వీటిని ఐదు వేల సంవత్సరాలకు క్రితం పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు నిర్మించినట్లు ప్రచారంలో ఉంది. 

అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు  అయితే ఎక్కువగా సంచరిస్తుంటారో అక్కడ  భక్తిశ్రద్ధలతో పూజించే వారట పాండవులు. అయితే ఈ ఆలయంలో స్వర్గానికి మెట్ల మార్గాన్ని కూడా నిర్మించాలనుకున్నారని పురాణాలు చెబుతున్నాయి.  శ్రీ కృష్ణుడు పాండవులకు ఈ ఆలయంలో స్వర్గానికి వెళ్లే మెట్లు నిర్మించే సమయంలో ఆయన కొన్ని ఆంక్షలను విధిస్తాడు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సమయంలో సూర్యుని  కాంతిని  చూడకూడదు.  ఒకవేళ అలా కాకుండా ఒకవేళ సూర్యుని యొక్క కాంతిని చూసినట్లయితే వారు స్వర్గానికి మెట్ల నిర్మాణాన్ని ఆపేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఇచ్చిన ఆరు నెలల గడువు లోపల నిర్మాణాన్ని పూర్తి చేయకపోయినా అలాగే ఆరు నెలల గడువు ముగిసే సరికి వారు ఒకవేళ నిర్మాణం పూర్తి చేయలేక పోతే తిరిగి వారు అజ్ఞాతవాసం కొనసాగించాలి అని చెప్తారు శ్రీకృష్ణుడు. పాండవులు అందుకు అంగీకరించి పగలు రాత్రి అని తేడా లేకుండా నిర్మాణంలో నిమగ్నమవుతారు.  ఈ క్రమంలో నిర్మాణాన్ని చీకట్లోనే చేస్తుంటారు. దేవాలయాల నిర్మాణం పూర్తయి మెట్ల నిర్మాణం కూడా చివరి దశకు చేరుకుని ఇంకొంత పని మిగిలి ఉంటుంది.  

ఇంతలో అక్కడికి  వచ్చిన ఒక స్త్రీ  దీపం వెలిగించి దేవునికి నమస్కరిస్తూ, ఆ వెలుగును చూసి పాండవులు సూర్యోదయం అయిందని భావించి  అక్కడితో నిర్మాణాన్ని ఆపేస్తారు. ఇదే కారణంతో   స్వర్గానికి మెట్ల యొక్క నిర్మాణం పరిపూర్ణం కాలేదని చెప్తారు. అటుపై పాండవులు శ్రీకృష్ణుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం మెట్ల మార్గాన్ని ఆపేసి తిరిగి వారి అజ్ఞాతవాసం కొనసాగిస్తారు.  ఇక్కడ ప్రధాన ఆలయంలో శివలింగం ఉంటుంది.  చిన్న ఆలయాల్లో విష్ణు మొదలైన దేవతా మూర్తులు ఉంటారు.  ఇక్కడ ఉన్న మరొక అద్భుతం ఏంటంటే సూర్యుడు అస్తమించేటప్పుడు చివరి కిరణాలు శివుడి పాదాలను తాకుతాయి. శివుడి పాదాలు తాకకుండా  సూర్యుడు అస్తమించడం జరగదు. ఇలా ఈ ఆలయం ఎంతో విశిష్టతను కలిగి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: