హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసం లో శుక్ల పక్షంలో లేదా.. పౌర్ణమి దశలో మాత్రమే చైత్ర నవరాత్రులను జరుపుకుంటూ ఉంటారు. మాత దుర్గను ఆరాధించే తొమ్మిది రోజులు ఏప్రిల్ 2వ తేదీ శనివారం నుంచి ప్రారంభమై 11 వ తేదీన సోమవారం రోజున ముగియనున్నాయట. అయితే సిద్ధాంతాల్లో పరంగా 4 నవరాత్రి సీజన్లు ఉన్నాయట. అయితే ఇందులో కేవలం రెండు నవరాత్రులు మాత్రమే చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడ్డయట. అవి ఏవి వాటి గురించి చూద్దాం.

మార్చి-ఏప్రిల్ మాసాలలో జరిగే ఈ ఉత్సవాన్ని చైత్ర నవరాత్రి గా పిలుస్తారు. ఇది వసంత ఋతువులో మాత్రమే వస్తుందట. అందుచేతనే దీనిని వసంత నవరాత్రులు కూడా పిలుస్తూ ఉంటారు. వసంత నవరాత్రులు చాలా పవిత్ర  మైనవి గా భావిస్తారు. అందుచేతనే భక్తులు 9 రోజులుగా దుర్గా దేవిని పూజిస్తూ తొమ్మిది అవతారాలలో ఉన్న మాతను ప్రతి రోజు ఒక్కో అవతారంలో ఉన్న మాతను పూజిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వారి కుటుంబంలోని ఆనందం, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయని నమ్మకం. చైత్ర నవరాత్రి పండుగ రోజున మహిషాసుర అనే ఒక రాక్షసుడిని యుద్ధంలో ఓడించి నటువంటి స్రీ నే దుర్గాదేవి .



ఇక అదే రోజున మనం చైత్ర నవరాత్రులు గా జరుపుకుంటాం. అయితే చైత్ర అనే పదానికి మరొక అర్థం ఏమిటంటే కొత్త సంవత్సరం ప్రారంభం అని అర్థమట. అందుచేతనే కొత్త సంవత్సరం మొదట్లో తొమ్మిది రోజులు దేవతల దగ్గర ప్రార్థనలు, చదవడం, ధ్యానం వంటివి చేయడం వల్ల ఎంతో శుభం కలుగుతుంది. ఇక అంతే కాదు ఇలాంటి సమయంలో కొన్ని జానపద కథలు కూడా గుర్తించబడ్డాయి. ఇక సానుకూలత మరియు అదృష్టాన్ని స్వాగతించడానికి నవరాత్రుల సమయంలో విభిన్నమైన రంగులతో ముగ్గులు వేసి.. నవరాత్రులను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుతూ ఉంటారు. ఇక చైత్ర నవరాత్రులను ఏ ఇంట్లో చేసుకున్నట్లయితే వారి ఇంట సుఖ సంతోషాలు ఉంటాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: