క్వారంటైన్ లో ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ ప్రశ్నోత్తరాల షేషన్ నిర్వహించాడు.. ఇందులో ఇన్ క్వారంటైన్.. ఆస్క్ మే యువర్ క్వషన్స్.. పేరుతో టైం పాస్ చేశాడు. అభిమానులకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఇక తను టీమిండియా ఏస్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తో ఇంస్టాగ్రామ్ ద్వారా చాట్ చేశాడు. అయితే వీరిద్దరి మధ్య పలు అంశాలు ప్రస్తావనకు రాగా, అందులో రవిచంద్రన్ అశ్విన్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పట్ల తనకు ఉన్న అభిప్రాయాన్ని రెండు ముక్కల్లో చెప్పాల్సిందిగా విరాట్ కోహ్లీని కోరాడు. ఇక ఈ సందర్భంగా కోహ్లీ తన మనసులోని మాటను బయట పెట్టాడు. ధోని అంటే నమ్మకం, గౌరవం ఉన్నాయని రెండు ముక్కల్లో తేల్చేశాడు. ఇక అంతే కాకుండా టీమిండియా కు ఎంపికైన తొలి రోజుల్లో తనను ప్రోత్సహించాడని కూడా చెప్పుకొచ్చాడు.. అంతేకాకుండా ధోని నుంచి కెప్టెన్సీని స్వీకరించడం అతిపెద్ద బాధ్యతగా భావిస్తున్నానని, దాన్ని నిలబెట్టుకోవడానికి శ్రమిస్తూ ఉంటానని చెప్పాడు.