వెస్టిండిస్ మహిళలతో టీ20  సిరీస్ ను   భారత మహిళలు కైవసం చేసుకోవడం జరిగింది. వరుసగా మూడో టీ20లో కూడా విజయం సాధించి ఇంకా రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగా సిరీస్ ను దక్కించుకోవడం జరిగింది. తాజాగా జరిగిన మూడో టీ20లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి  సిరీస్ ను  ఖాతాలో వేసుకోవడం జరిగింది. మొదట  బ్యాటింగ్ చేసిన వెస్టిండీసన్ను 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 59 పరుగులకే కట్టడి చేసిన భారత్.. ఆపై 16.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పో యి మ్యాచ్ ను సొంతం చేసుకున్నారు. ఫలితంగా సిరీస్ ను 3-0తో సాధించుకోవడం జరిగింది.


వెస్టిండీస్ క్రీడాకారిణుల్లో చేదన్ నేషన్(11), హెన్రీ(11)లు మాత్రమే రెండంకెల స్కోరును దాటగా మిగతా వారు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో రాధా యాదవ్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు సాధించగా, అనుజా పటేల్, పూజా వస్త్రాకర్, హర్మన్ ప్రీత్ కౌర్, పూనమ్ యాదన్లు తలో వికెట్ తీశారు. 60 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన భారత్ ఓపెనర్ల వికెట్లను 13 పరుగులకే కోల్పోవడం జరిగింది.


రెండో టీ20లో హర్మన్‌ప్రీత్‌ సేన 10 వికెట్ల తేడాతో విజయం సొంతం చేసుకున్నారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ను భారత బౌలర్‌ దీప్తి శర్మ దిమ్మ తిరిగేయాలాగా చేసింది. నాలుగు ఓవర్లలో కేవలం పది పరుగులిచ్చి కీలక నాలుగు వికెట్లు తీసింది. దీంతో ఆతిథ్య జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. 
మంధాన(3), షెఫాలీ వర్మ(0)లు తీవ్రంగా నిరాశపరిచారు. తొలి రెండు టీ20ల్లో ఇరగదీసిన వీరిద్దరూ.. మూడో మ్యాచ్ లో ఆరంభంలోనే వికెట్లను చేజార్చుకున్నారు. అనంతరం జెమీమా రోడ్రిగ్స్ (40 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చింది. వెస్టిండీస్ మహిళలతో జరిగిన వన్డే సిరీస్ ను 2-1 తేడాతో భారత మహిళలు కైవసం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: