ప్రపంచాన్ని అతలాకుతం చేస్తున్న కరోనా ప్రభావం అందరి మీద పడుతుంది. సినీ, రాజకీయ, క్రీడారంగాలపై ఈ కరోనా ఎఫెక్ట్ బీభత్సంగా పడింది.  సినీ ప్రముఖులను కూడా ఈ కరోనా వదలడం లేదు. తాజాగా  ఇప్పుడు ఈ కరోనా భారిన పడిన ప్రముఖ ఫుట్‌బాల్ కోచ్ మరణించాడు. 21 ఏళ్ల స్పానిష్ ఫుట్‌బాల్ కోచ్ ఫ్రాన్సిస్కో గార్సియా మాలాగాలో కరోనా కారణంగా మరణించాడు. అయితే తీవ్రమైన కరోనావైరస్ లక్షణాలతో ఆసుపత్రికి వెళ్లిన తరువాత గార్సియా కు లుకేమియా కూడా ఉన్నట్టుగా నిర్ధారించారు వైద్యులు. కరోనా మహమ్మారితో కోచ్ ఫ్రాన్సిస్కో గార్సియా  ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని అథ్లెటికో పోర్టాడా ఆల్టా క్లబ్ వెల్లడించింది.

 

మహమ్మారి కారణంగా యువ కోచ్‌ను పోగొట్టుకోవడంతో ఆటగాళ్లతో పాటు ఆ దేశ ప్రజలు ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ క్రీడారంగంలో మరణించిన వారిలో అతి పిన్న వయస్కుడు గార్సియానే కావడంతో మరింత కలవరం మొదలైంది. వెంటనే అక్కడి ప్రభుత్వం అప్రమత్తమై నివారణ చర్యలను ముమ్మరం చేశారు.  ఇదిలా ఉంటే.. ఫ్రాన్సిస్కో గార్సియా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. అలాగే, కరోనా వైరస్ మరింత వ్యాపించకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంది. అందులో భాగంగా స్పానిష్ ఫుట్ ‌బాల్ లీగ్‌ను రెండువారాలపాటు వాయిదా వేసింది.

 

 కాగా, మృతి చెందిన ప్రాన్సిస్కో ఇప్పటికే లుకేమియాతో బాధపడుతున్నాడు. అతడికి కరోనా వైరస్ సోకడంతో పరిస్థితి మరింత విషమించింది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహ్మారితో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 5 వేల మందికి పైగా మరణాలు సంబవించాయి. అయితే ఈ మరణాలు ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.  మరోవైపు లక్షకు పైగా ఈ వైరస్ భారిన పడ్డట్టు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: