మహమ్మద్ షమీ... ప్రస్తుతం టీమిండియా బౌలర్ల చెప్పుకోతగ్గ వారిలో ఈయన ఒకడు. ఈ మధ్య కాలంలో ఆయన కొన్ని ఇంటి పరిస్థితుల వల్ల వార్తలలో ఎక్కువగా నిలిచారు. కానీ అవి అన్ని పక్కకి నెట్టేసి ఆయన ప్రతిభని చివరిగా జరిగిన వరల్డ్ కప్ లో షమీ అంటే ఏమిటో ఆయన నిరూపించుకున్నాడు. ఆ తరువాత కూడా ఆయన తన ప్రతిభని నిరూపించుకుంటూనే వచ్చాడు. ఇక అసలు విషయానికి వస్తే కరోనా పుణ్యమా అని ఆటగాళ్లు అందరూ వారి వారి ఇళ్లకు మాత్రమే పరిమితమయ్యారు. 

 

 

ఇలా పరిమితమైన వారు వారి అభిమానుల కోసం ఆన్లైన్ లో అప్పుడప్పుడు ప్రత్యక్షమైతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి షమీ కూడా చేరాడు . ఆయన కూడా తనకి సంబంధించిన సోషల్ మీడియా ద్వారా ఆన్లైన్ లోకి వచ్చాడు. తన భావాలను అందులో చెప్పుకొచ్చాడు. ఇక ఆయన ఏమని చెప్పాడంటే భారతదేశంలో ఉన్న ప్రజలంతా 21 రోజుల పాటు ఇళ్లలోనే ఉండాలని షమీ విజ్ఞప్తి చేశాడు. అలాగే దానికి #GharBaithoIndia అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశాడు ఈ ఫాస్ట్ బౌలర్. నిజానికి "ఇంట్లో కూర్చునే ప్రతీ ఒక్క పౌరుడు ఈ దేశానికి నిజమైన హీరో. హీరోగా ఉండడం అంత తేలిక కాదు" అంటూ తన సోషల్ అకౌంట్ లో రాసుకొచ్చాడు. అలాగే వైద్యులు చెప్పిన మాటలని వినాలని ఆయన ఈ సందర్బంగా ఆయన భారతీయుల్ని విజ్ఞప్తి చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: