అయితే బూమ్రా విసిరే బుల్లెట్ లాంటి యార్కర్లకు అసలు ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ల దగ్గర సమాధానమే ఉండదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు భారత జట్టు తరఫున ఎన్నో మ్యాచ్లు ఆడిన జస్ప్రిత్ బూమ్రా.. ఎన్నో వికెట్లు పడగొట్టి రికార్డులను కూడా కొల్లగొట్టాడు అన్న విషయం తెలిసిందే. అన్ని విషయాలు భారత క్రికెట్ ప్రేక్షకులకు తెలిసినప్పటికీ జస్ప్రిత్ బూమ్రా ఇప్పటివరకు భారత్ లో స్వదేశీ గడ్డపై ఒక్క టెస్ట్ కూడా ఆడలేదు. ఏంటి ఆశ్చర్య పోతున్నారు కదా.. కానీ ఇది నిజమే ఇప్పటి వరకూ జస్ప్రిత్ బూమ్రా ఆడిన టెస్ట్ మ్యాచ్ లు అన్నీ కూడా విదేశాల్లో ఆడినవే కావడం గమనార్హం.
కానీ మొదటిసారి జస్ప్రిత్ బూమ్రా స్వదేశంలో టెస్ట్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంగ్లాండ్ భారత్ మధ్య ఫిబ్రవరి 5నుంచి చెపాక్ స్టేడియం వేదికగా ప్రారంభం కాబోయే టెస్ట్ మ్యాచ్ జస్ప్రిత్ బూమ్రా కు స్వదేశంలో మొదటి టెస్టు మ్యాచ్ కాబోతూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే స్వదేశంలో తన మొదటి టెస్ట్ మ్యాచ్లో జస్ప్రిత్ బుమ్రా ఎలా రాణించపోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇప్పటి వరకు విదేశాలలో 17 టెస్ట్ లు ఆడిన జస్ప్రిత్ బూమ్రా ఇక ఈ ఫార్మాట్లో ఇప్పటి వరకు 76 వికెట్లు పడగొట్టాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి