ఇటీవ‌లే దుబాయ్ వేదిక గా ఐపీఎల్ ముగిస‌న విష‌యం తెలిసిందే. ఈ ఏడాది చెన్నై సూప‌ర్ కింగ్స్ ఫైన‌ల్ విజ‌యం సాధించి క‌ప్ ను సొంతం చేసుకుంది. అయితే 2022 కు సంబంధించి ఐపీఎల్ ను నిర్వ‌హించ‌డానికి బీసీసీఐ ఇప్ప‌టి నుంచే స‌న్నాహాకాలు చేస్తుంది. అలాగే వ‌చ్చే ఏడాది ఐపీఎల్ లో మ‌రో రెండు కొత్త జ‌ట్లు ను చేర్చ‌డానికి బీసీసీఐ నిర్ణ‌యం తీసుకుంది. అందులో భాగంగా కొత్త జ‌ట్ల కోసం టెండ‌ర్ల ను కూడా ఆహ్వానించింది. ఈ టెండ‌ర్ల గ‌డువు బుధ‌వారం తో ముగిసింది. అయితే కొత్త జ‌ట్ల ను ద‌క్కించు కోవ‌డానికి చాలా మంది టెండ‌ర్లు వేసిన‌ట్టు తెలుస్తుంది. ఆదానీ కంపెనీ తోపాటు మ‌రి కొన్ని సంస్థ‌లు టెండ‌ర్లు వేసిన‌ట్టు స‌మాచారం.అయితే ఈ కొత్త జ‌ట్ల కోసం మ‌న దేశ కంపెనీ ల తో పాటు విదేశీ కంపెనీ లు కూడా టెండ‌ర్లు వేసిన‌ట్లు తెలుస్తుంది. అయితే అందులో ముఖ్యంగా స్టార్ ఫుట్ బాల్ ప్లేయ‌ర్ క్రిస్టియానో రోనాల్డో ప్రాతినిథ్యం వ‌హించే మాంచెస్ట‌ర్ యునైటెడ్ యాజ‌మాన్యం కూడా కొత్త జట్ల కోసం టెండ‌ర్ వేసిన‌ట్టు తెలుస్తొంది. అయితే మాంచెస్ట‌ర్ యునైటెడ్ క్ల‌బ్ వ‌ర‌ల్డ్ లోనే ఖ‌రీదైన క్ల‌బ్. ఈ క్ల‌బ్ కు ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్ల‌లో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్ల‌బ్ ఇంగ్లాండ్ లో నిర్వ‌హించే క్రికెట్ లీగ్ లో కూడా ఒక జ‌ట్టు తో భాగం అయి ఉంది. ఇప్పుడు ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ పై కూడా క‌న్ను వేసింది.ఈ మాంచెస్ట‌ర్ యునైటెడ్ క్ల‌బ్ కు మ‌న దేశం నుంచి చాలా మంది అభిమానులు ఉన్నారు. గ‌తంలో టీమిండియా ఫేస్ బౌల‌ర్ బుమ్రా కూడా ఈ క్ల‌బ్ స్టేడీయాన్ని సంద‌ర్శించారు. అక్క‌డి బుమ్రా కు ఒక బ‌హుమ‌తి కూడా ఇచ్చారు. అయితే ఈ క్ల‌బ్ ఇండియా లో ప్ర‌వేశించ‌డానికి చాలా ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌ని తెలుస్తోంది. ఈ టెండ‌ర్ల‌లో ఒకటి త‌ప్ప‌కుండ త‌మ‌కు వ‌స్తుంద‌ని దీమా వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. అయితే ఈ పోటీలో ఆదానీ గ్రూప్ తో పాటు టోరెంట్ ఫార్మా, అర‌బిందో ఫార్మా, హిందుస్థాన్ టైమ్స్, జిందాల్ స్టీల్, రోనీ స్క్రూవాలా, ఆర్ పీ సంజీవ్ గోయొంకా గ్రూప్ లు పోటీలు ఉన్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: