గత కొద్ది రోజుల నుంచి టీమిండియా అంతర్జాతీయ జట్టు ప్రేక్షకులందరికీ నిరాశే మిగులుస్తుంది. ప్రస్తుతం సౌత్ఆఫ్రికా పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా పేలవా ప్రదర్శనతో వరుసగా ఓటమి చవి చూస్తుంది అన్న విషయం తెలిసిందే. ముందుగా సౌత్ఆఫ్రికా పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్ ఓడిపోయిన టీమిండియా ఇటీవలే వన్డే సిరీస్లో కూడా వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయి  ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను చేజార్చుకుంది. దీంతో అభిమానులు అందరూ ఎంతగానో నిరాశలో మునిగిపోయారు. అయితే ఇలాంటి సమయంలోనే మరో వైపు టీమిండియా కుర్రాళ్ళ జట్టు మాత్రం అద్భుతంగా రాణిస్తోంది. ప్రస్తుతం అండర్-19 ప్రపంచ కప్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రపంచ కప్ లో భాగంగా మొదటి మ్యాచ్ సౌతాఫ్రికా జట్టు తోనే ఆడింది భారత కుర్రాళ్ల జట్టు ఇక మొదటి మ్యాచ్లో ఘన విజయాన్ని సాధించింది. ఇక ఆ తర్వాత ఇదే జోరును కొనసాగిస్తూ వస్తోంది అండర్ 19 టీమ్ ఇండియా జట్టు. వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇక ప్రతి మ్యాచ్లో కూడా కుర్రాళ్ళ జట్టు ప్రత్యర్థులకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా అద్భుతంగా రాణిస్తుంది అని చెప్పాలి. ఒకవైపు బ్యాటింగ్ విభాగంలో మరోవైపు బౌలింగ్ విభాగంలో కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. ఇలా విజయ పరంపర కొనసాగిస్తూ దూసుకుపోతోంది టీమిండియా జట్టు. ఇక ఇటీవలే అండర్-19 ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా రికార్డు సృష్టించింది. ఉగాండా తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. ఇక భారత అండర్-19 జట్టు లో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ రాజ్ బవ 108 బంతుల్లో 162 పరుగులు చేసి అదర కొట్టాడు. ఇందులో 14 ఫోర్లు 8 సిక్సర్లు ఉండటం గమనార్హం. ఒక రకంగా ఉగాండా బౌలర్ల తో చెడుగుడు ఆడాడు. ఇక ఆ తర్వాత 120 బంతుల్లో 144 పరుగులతో రఘువంశీ ఇరగదీశాడు. ఇలా ప్రత్యర్థి ముందు ఏకంగా 50 ఓవర్లలో 406 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది భారత జట్టు. అండర్ 19 వరల్డ్ కప్ లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: