ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ప్రభావం ఎలా ఉంటుందో క్రికెట్ ప్రేక్షకులకు తెలిసిన విషయమే. ఇప్పటి వరకు జరిగిన 14 ఐపీఎల్ సీజన్ లలో 5 ట్రోపీలు గెలుచుకుని తమకు సాటి లేదని చాటి చెప్పింది ముంబై ఇండియన్స్. అన్ని టైటిల్స్ కూడా రోహిత్ శర్మ సారధ్యంలో గెలుచుకున్నవే. అంత గొప్ప రికార్డు ఉంది రోహిత్ శర్మకు, కానీ ఈ సీజన్ లో మాత్రం కేవలం ఒక్క గెలుపు కోసం ఇంకా ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ మూడు మ్యాచ్ లు ఆడింది. కానీ గెలుపు మాత్రం దక్కింది లేదు. ఇందుకు చాలా కారణాలు ఉన్నా ఎందుకో ముంబై ఇండియన్స్ యాజమాన్యం మరియు సిబ్బంది పెద్దగా పట్టించుకుంటున్నట్లు లేదు.

ఎందుకంటే ప్రతి సీజన్ లోనూ మొదట మ్యాచ్ లు ఓడిపోవడం అలవాటుగా మారిపోయింది. ఆ తర్వాత వరుసగా మ్యాచ్ లు గెలుస్తూ ప్లే ఆప్స్ కు అర్హత సాధించడం మరియు టైటిల్ కొట్టడం పరిపాటి. కానీ నిన్న కోల్కతాతో జరిగిన మ్యాచ్ లో ఓడిపోవడంతో కెప్టెన్ రోహిత్ శర్మ బాగా బాధ పడ్డాడు. ఎందుకంటే కోల్కతా తో గెలుపు ఓటముల రికార్డు ముంబై కి అనుకూలంగా ఉంది. అందుకే ఖచ్చితంగా గెలుస్తామని భావించారు. కానీ ఆఖరిలో ఆస్ట్రేలియా ఆటగాడు పాట్ కమిన్స్ ముంబై ఇండియన్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. వచ్చిన ప్రతి బంతినీ కూడా బౌండరీ లక్ష్యంగా ఆడాడు.

నిన్న మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ తన ఆవేదనను తెలిపాడు. మ్యాచ్ లో 15 వ ఓవర్ వరకు గెలుపుపై మాకు ఆశలు ఉన్నాయి. కానీ పాట్ వచ్చి మా ఆశలన్నీ కూల్చేశాడు. మ్యాచ్ లో గెలవడానికి కావాల్సిన ప్రదర్శన మా ఆటగాళ్లు చేస్తున్న చివరికి ఓటమి పాలవ్వడం చాలా ఇబ్బందికరంగా ఉందని రోహిత్ శర్మ ఫీలయ్యాడు. ప్రతి సారి ముంబై ఇండియన్స్ మొదటి మ్యాచ్ లలో ఓటమి పాలవ్వడం తట్టుకోలేకున్నామని ఆవేదన చెందాడు. మరి ఇక ముందు ఫిక్సర్లు లో అయినా ముంబై ఇండియన్స్ తమ తప్పులను దిద్దుకుని విజయాల బాట పడుతుందా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: