అందులోనూ విరాట్ కోహ్లీ వరుసగా ఫెయిల్ అవుతుండడం నిరాశను మిగుల్చుతోంది. ఇప్పటి వరకు ఆడిన 9 ఇన్నింగ్స్ లలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. నిన్న మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చినా రాణించలేకపోయాడు.
మాక్స్ వెల్ లాంటి క్వాలిటీ ఆల్ రౌండర్ కూడా వరుసగా విఫలం కావడం ఏమిటో అస్సలు అర్ధం కావడం లేదు. అయితే మాక్స్ వెల్ కు మంచి హిట్టర్ గా పేరుంది కానీ, జట్టు ఉన్న పరిస్థితికి తగినట్లు ఆడడంలో మాత్రం ఇంకా పరిణితి చెందాల్సిన అవసరం ఉంది. వరుసగా వికెట్లు పడుతున్నప్పుడు కూల్ గా కొన్ని బాల్స్ ఆడిన తర్వాతనే హిట్టింగ్ చేయాలి. అలా కాకుండా బౌలర్ రేజింగ్ లో ఉన్నప్పుడు భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించకూడదు.
ఇక అడపాదడపా డుప్లిసిస్ కొంచెం స్కోర్ చేయగలుగుతున్నాడు, అతనికి తోడుగా దినేష్ కార్తీక్ మరియు షాబాజ్ అహ్మద్ లు తలో చేయి వేస్తున్నారు. మరి ఇదే విధంగా తమ ఆటతీరు కనుక ఉంటే ఐపీఎల్ టైటిల్ కాదు కదా, ప్లే ఆప్స్ చేరడం కూడా కష్టమే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి