దీపక్ చాహర్ : స్టార్ ఆల్రౌండర్ పై ఎంతో నమ్మకం తో చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా 14 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. కానీ తొడ కండరాల గాయం కారణంగా అర్ధాంతరంగా సిరీస్ దూరం అయ్యి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కు షాకిచ్చాడు దీపక్ చాహర్.
ఆడమ్ మిల్నే : ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ విదేశీ ఫేసర్ ను జట్టులోకి తీసుకుంది చెన్నై. కానీ మోకాలి గాయంతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అతని స్థానంలో శ్రీలంక ప్రేయర్ తీక్షణ అదరగొడుతున్నాడు.
మార్కువుడ్ : ఇంగ్లాండ్ పేసర్ మార్క్ వుడ్ ను కొత్త జట్టు లక్నో 7.50 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే మోచేతి గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ స్టార్ ప్లేయర్ స్థానంలో లక్నో ఎవరో ఆటగాడిని జట్టులోకి తీసుకుంది.
నాథన్ కౌల్టర్ నైల్ : హైదరాబాద్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లోనే గాయపడిన రాజస్థాన్ బౌలర్లలో కౌల్టర్ నైల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. దొర కండరాలు పట్టేయడం తో ఇక జట్టుకు దూరమయ్యాడు. ఇతని రెండు కోట్లకు కొనుగోలు చేసింది రాజస్థాన్.
లవ్ నీత్ సిసోడియా : అన్ క్యాప్డ్ ప్లేయర్ గా ఉన్న లవ్ నీత్ సిసోడియా ను 20 లక్షలకు దక్కించుకుంది బెంగుళూరు. కానీ గాయం కారణంగా టీ20 లీగ్ ఆడే అవకాశాన్ని చేజార్చుకున్నాడూ. అతను స్థానంలో రాజత్ పాటుధార్ జట్టులోకి తీసుకుంది.. రెండు మ్యాచ్ లు ఆడి 68 పరుగులు చేశాడు. ఇప్పుడు బాగా రాణిస్తూ ఉన్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి