ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీ లో భాగంగా ప్రతి జట్టు కూడా హోరాహోరీగా పోరాడుతోంది. దీంతో ప్రతీ మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగా మారుతుంది అనే చెప్పాలి. ఇకపోతే ఇటీవలే ఒక బౌలర్ తన అద్భుతమైన బంతితో ఏకంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోయాడు అని చెప్పాలి. లంక షైర్ లెగ్ స్పిన్నర్ మార్ట్ పార్కిన్సన్ కౌంటీ క్రికెట్ చాంపియన్షిప్ లో ఒక అద్భుతమైన బంతి సంధించాడు.   ఇటీవలే కౌంటీల్లో భాగంగా లంక షేర్ వార్విక్ షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్లో భాగంగా రెండో ఇన్నింగ్స్ సమయంలో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ను తికమక పెట్టెందుకు ఆఫ్ స్టంప్ లో  అవతల బంతిని వేసాడు.


 అయితే ఆ బంతిని డిఫెండ్ చేయాలని ప్రయత్నించాడు బ్యాట్స్మెన్. ఈ క్రమంలోనే క్రీజూ నుంచి బయటకు వచ్చేసాడు. ఇంతలో ఆ బంతి అనూహ్యంగా టర్న్ తీసుకుని ఆఫ్ స్టంప్ వికెట్లు పడగొట్టింది. దీంతో అక్కడున్న వారందరూ కూడా ఒక్కసారిగా షాకయ్యారు. ఇక బ్యాట్స్మెన్ కి కూడా అక్కడ ఏం జరిగిందో కాసేపటి వరకు అర్థం కాలేదు. చివరికి వికెట్ కోల్పోయాను అని తెలుసుకుని అక్కడినుంచి పెవిలియన్ బాట పట్టాడు. అయితే పార్కిన్సన్ ఇలాంటి అరుదైన బంతులు వేయడం ఇదే తొలిసారి కాదు. 2021 లో కూడా ఇలాంటి బంతితో ఒక వికెట్ పడగొట్టాడూ. అంతేకాదండోయ్ వార్న్ బాల్ ఆఫ్ ది సెంచరీని గుర్తుచేస్తూ పార్కిన్సన్ సెలబ్రేషన్స్ చేసుకోవడం వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఇతని గురించి అందరూ చర్చించుకుంటున్నారు అనే చెప్పాలి. కాగా ఇంగ్లండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్ లో ఐదు వన్డేలు నాలుగు టి20 మ్యాచ్ ఆడాడు పార్కిన్సన్. అంతేకాదు ఇతని బౌలింగ్ శైలి చూస్తుంటే ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ గుర్తుకొస్తున్నాడు అంటూ అభిమానులు కామెంట్లు పెడుతూ ఉండటం గమనార్హం. కాగా షేర్ వార్న్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ మైక్ గాటింగ్ ను అవుట్ చేసిన తీరు క్రికెట్ చరిత్రలో బాల్ అఫ్ ది సెంచరీ గా నిలిచిపోయింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: