ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో లీగ్ దశ ముగిసిన తర్వాత జరిగిన మొదటి క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచ్ లు ఎంత ఉత్కంఠభరితంగా జరిగాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పుడు అంతకు మించిన ఉత్కంఠతో నేడు సాయంత్రం ఏడున్నర గంటలకు రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే.  నేడు జరగబోయే కీలకమైన మ్యాచ్ లో ఎవరు విజయం సాధించబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది అని చెప్పాలి. ఇప్పటికే లక్నో జట్టుపై గెలిచి ఎంతో జోరుమీద కనిపిస్తుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.


 అదే సమయంలో ఇక మొదటి క్వాలిఫైయింగ్ మ్యాచ్ లో ఓడిపోయినా రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈసారి విజయం సాధించి ఫైనల్లోకి వెళ్లాలనే కసితో కనిపిస్తుంది. ఇక ఈ రెండు జట్లు కూడా అటు ఫైనల్ లో అడుగుపెట్టక చాలా ఏళ్లు అవుతున్నాయి. దీంతో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కప్పు కొట్టాలనే దృఢ సంకల్పంతో ఉన్నాయి ఈ రెండు జట్లు. ఈ క్రమంలోనే నేడు జరగబోయే ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారో అన్న విషయంపై అటు మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి.


 ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది ఐపిఎల్ విజేత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అంటూ జోస్యం చెప్పాడు. బెంగళూరు జట్టు తప్పకుండా కప్పు గెలుస్తుందని గట్టిగా నమ్ముతున్నట్లు వెల్లడించాడు. ప్లే ఆఫ్ కోసం ఆ జట్టు ఎంతో శ్రమించిందని.. ఇక  ఆ జట్టును ఆపడం చాలా కష్టం అనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో ట్రోఫీ అందించే ఆటగాళ్లు ఉన్నారు అంటూ వ్యాఖ్యానించాడు. అంతేకాదు రాజస్థాన్ లో జరగబోయే మ్యాచ్ రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ లా కాకుండా ఒక సాదాసీదా మ్యాచ్ గానే భావిస్తేనే ఒత్తిడిని జయించవచ్చు అని హర్భజన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl