ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ క్రికెటర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ గత కొంతకాలం నుంచి మాత్రం పేలవమైన ఫామ్ కారణంగా పరుగులు చేయడానికి ఎంతగానో ఇబ్బందులు పడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ పై క్రికెట్ ప్రేక్షకులందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే.. మరికొన్ని రోజుల్లో విరాట్ కోహ్లీ  మునుపటి ఫామ్ తో పుంజు కుంటాడు  అని అభిమానులు అందరూ కూడా అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే విరాట్ కోహ్లీ మైదానంలో ఎంతో అగ్రేసీవ్ గా ఉన్నప్పటికీ అటు ఎప్పుడు క్రీడాస్ఫూర్తిని చాటతు అభిమానులందరినీ కూడా గర్వపడేలా చేస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే.


 ఇకపోతే ఇటీవల అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన రెండవ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ చూపించిన క్రీడాస్ఫూర్తి అభిమానులందరినీ కూడా ఎంతగానో ఆకర్షించింది. ఈ మ్యాచ్ లో 8 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేసి మరోసారి నిరాశపరిచాడు విరాట్ కోహ్లీ. అతడితో పాటు మిగతా ఆటగాళ్లు కూడా విఫలం కావడంతో చివరికి బెంగళూరు జట్టుకు ఓటమి తప్పలేదు అని చెప్పాలి. అయితే బెంగళూరు ఇన్నింగ్స్ సమయంలో బౌలర్ వేసిన తొలి ఓవర్లో డీప్ మిడ్ వికెట్ దిశగా కోహ్లీ ఫ్లిక్ షాట్ ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న జాస్ బట్లర్ డైవ్ చేస్తూ బంతిని అందుకున్నాడు. ఇక నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు త్రో చేశాడు.


ఈ క్రమంలోనే క్రీజులోకి చేరుకున్న విరాట్ కోహ్లీ కాలిని తాకుతూ ఫీల్డర్  లేని వైపు వెళ్ళింది బంతి.. ఆ సమయంలో ఎవరైనా సరే మరో పరుగు చేయడానికి ప్రయత్నిస్తారు. కాని విరాట్ కోహ్లీ మాత్రం స్ఫూర్తిని ప్రదర్శించి మరో పరుగు తీసేందుకు ప్రయత్నం చేయలేదు. కానీ మరో ఎండ్ లో ఉన్న డూప్లెసిస్ మాత్రం అదనపు పరుగు కోసం ప్రయత్నించాడు. కాని కోహ్లీ మాత్రం వద్దు అంటూ వారించడం  గమనార్హం. ఈ వీడియో వైరల్ గా మారి పోవడం తో ఇది చూసిన అభిమానులు మురిసిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: