
భారీగా పరుగులు చేస్తూ పరుగుల యంత్రం అంటూ అభిమానులతో ముందుగా పిలిపించుకున్నాడు. దాదాపు గత మూడేళ్ళ నుంచి మాత్రం అతను సరిగ్గా రాణించడం లేదు. ఇక సెంచరీ చేసి మూడు ఏళ్లు గడిచిపోతున్నాయి. అతను సెంచరీ చేస్తే చూడాలని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. కానీ ప్రతి మ్యాచ్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగడం చివరకు నిరాశ పరచడం లాంటివి చేస్తున్నాడు విరాట్ కోహ్లీ. ఇక మొన్నటికి మొన్న ఐపీఎల్ లో కూడా సరిగ్గా రాణించలేకపోయాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతని పై విమర్శలు కూడా వస్తున్నాయి.
ఇటీవల ఇదే విషయంపై స్పందించిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అటు విరాట్ కోహ్లీ కి మద్దతుగా నిలిచాడు . టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆల్ టైం గ్రేట్ ప్లేయర్ అని.. ప్రతి ఒక్కరు అతనికి తగిన గౌరవం ఇవ్వాలి అని సూచించాడు. అతడు అంతర్జాతీయ క్రికెట్లో తప్పకుండా 110 సెంచరీలు చేస్తాడని.. ఈ విషయంలో ఎవరి తో అయిన పందెం కాయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ షోయబ్ కోహ్లీ పై చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే కోహ్లీ పేలవ ఫామ్ నేపథ్యంలో బీసీసీఐ కొన్నాళ్లపాటు అతనికి విశ్రాంతినిచ్చింది అనే విషయం తెలిసిందే.