ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం పటిష్టమైన జట్టుగా ఉన్న భారత్ కు అటు సౌత్ ఆఫ్రికా జట్టుపై మాత్రం చెత్త రికార్డులే  ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన టీ20 సిరీస్ లో భాగంగా ఆ చెత్త రికార్డును చేరిపేసుకోవడం  పై టీమిండియా దృష్టిసారించింది అని చెప్పాలి. 2-2  తో  5 టి20 మ్యాచ్ ల సిరీస్లో సమంగా  కొనసాగుతుండగా..  5వ టీ20 మ్యాచ్ లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని అనుకుంది టీమిండియా. కానీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో ఇక సిరీస్ సమమైంది అని చెప్పాలి.


 ఇంతకీ దక్షిణాఫ్రికా పై ఉన్న చెత్త రికార్డు ఏమిటంటే.. 2015-16 లో దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చింది. టీమిండియాకు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నాడు. తొలి టీ-20 మ్యాచ్ రద్దయింది. ఆ తర్వాత రెండో టీ20 మ్యాచ్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. మూడో టి20 మ్యాచ్ లోనూ అదే జోరు కొనసాగించి  విజయఢంకా మోగించింది.  దీంతో సొంతగడ్డపైనే భారత జట్టును ఓడించి సిరీస్ సొంతం చేసుకుంది ప్రోటీస్ జట్టు. ఇక 2019లో కూడా ఇలాంటిదే జరిగింది. దక్షిణాఫ్రికా మరోసారి భారత పర్యటనకు వచ్చింది. టీమిండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లీ వ్యవహరిస్తున్నాడు. ఈ రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్ ల టి-20 సిరీస్ జరిగింది.


 ఇక ఈ టి 20 సిరీస్ లో భాగంగా తొలి టీ-20 మ్యాచ్ రద్దు అయ్యింది. ఆ తర్వాత జరిగిన రెండో టీ20 మ్యాచ్లో భారత్ దక్షిణాఫ్రికా జట్లు చెరో మ్యాచ్ లో విజయం సాధించాయి. రెండో మ్యాచ్ లో భారత్  7 వికెట్ల తేడాతో సొంతం చేసుకుంటే.. నిర్ణయాత్మకమైన మూడో మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో 9 వికెట్లు తేడాతో ఓడిపోయింది. దీంతో అప్పుడుకూడా సిరీస్ సమమైంది. ఇక ఇప్పుడు మరోసారి భారత పర్యటనకు వచ్చిన సౌతాఫ్రికా జట్టు ఐదు టీ20 మ్యాచ్ ల సీరిస్ లో భాగంగా సిరీస్ సమం చేసింది. ఐదవ టి20 మ్యాచ్  రద్దు కావడంతో ఇండియాకు చెత్త రికార్డు చేరిపేసుకునే  అవకాశం లేకుండా పోయింది. ఇక ఈ విషయం తెలిసిన తర్వాత ధోని, కోహ్లీ వల్లే కాలేదు ఇక రిషబ్ పంత్ వల్ల ఏమవుతుంది అని కొంతమంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: