టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడుగా ఎంత గుర్తింపు సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియాకు సరికొత్త  నేర్పించాడు విరాట్ కోహ్లీ. అయితే విరాట్ కోహ్లీ అటు మైదానంలో ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాన్స్ వస్తే చాలు ఏకంగా ప్రత్యర్థి ఆటగాళ్లపై విరుచుకు పడుతూ ఉంటాడు. అందుకే ప్రత్యర్థి ఆటగాళ్లు విరాట్ కోహ్లీ ని చూస్తుంటే భయపడిపోతుంటారు అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు మ్యాచ్ ఉత్కంఠభరితంగా జరుగుతున్న సమయంలో స్లెడ్జింగ్ చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటాడు.


 ఇకపోతే ఇటీవలే ఇంగ్లాండ్ భారత్ మధ్య జరిగిన ప్రతిష్టాత్మకమైన ఐదవ టెస్ట్ మ్యాచ్లో కూడా ఇలా మాటల యుద్ధానికి దిగాడు అన్న విషయం తెలిసిందే. మంచి ఫాంలో కొనసాగుతున్న జానీ బెయిర్ స్టో  విరాట్ కోహ్లీ మధ్య మాటల యుద్ధం జరిగిన  ఘటన కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్ చేసిన తర్వాత మరింత రెచ్చిపోయిన జానీ బెయిర్ స్టో సెంచరీతో చెలరేగిన పోయాడు. విరాట్ కోహ్లీతో వివాదంపై స్పందించిన బెయిర్ స్టో ఆటలో ఇవన్నీ భాగమేనని ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.



 ఈ మ్యాచ్ లో అటు ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించిన తర్వాత అప్పటివరకు స్లెడ్జింగ్ పాల్పడిన విరాట్ కోహ్లీ క్రీడాస్ఫూర్తిని చాటుకుంటూ ఏకంగా జానీ బెయిర్ స్టో జో రూట్ లను ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల ఇదే విషయంపై స్పందించిన ఇంగ్లాండ్ మాజీ కోచ్ డేవిడ్ లూయిడ్ టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ క్రీడాస్ఫూర్తిని మెచ్చుకున్నాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత జో రూట్, జానీ బెయిర్ స్టో లను భారత ఆటగాళ్లు అభినందించడం బాగుంది. మరి ముఖ్యంగా మైదానంలోకి తన హావభావాలతో విలన్ గా కనిపించే విరాట్ కోహ్లీ మ్యాచ్ అనంతరం ప్రత్యేకంగా వారిద్దరినీ అభినందించడం ఎంతగానో నచ్చింది. ఇక ఇంగ్లాండ్ ఇండియా యుద్ధం లో క్రీడాస్ఫూర్తి, పరిహాసం, అనుచిత ప్రవర్తన, అవమానాలు, మాటల యుద్ధం ఇలా అన్నింటిని చూశాము అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: