టీమిండియా కెప్టెన్గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ బ్యాటింగ్ లో సృష్టించే విధ్వంసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. ఎప్పుడు బ్యాటింగ్ చేసిన కూడా ఓపెనర్ గా బరిలోకి దిగుతూ సిక్సర్లతో చెలరేగిపోతా ఉంటాడు రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ బౌలింగ్ చేయాలంటే అటు బ్యాట్స్మెన్లు అందరూ కూడా భయపడిపోతుంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితేఇలా తన బ్యాటింగ్తో రోహిత్ శర్మ ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో ఎన్నో రికార్డులను కొల్లగొట్టి తనపేరు లిఖించుకున్నాడు అనే చెప్పాలి.


 తన పవర్ ఫిట్టింగ్ బ్యాటింగ్ తో ఏకంగా హిట్ మాన్ గా అభిమానులందరి తో కూడా పిలిపించుకున్నాడు అనే చెప్పాలి. ఇటీవలే మరో ప్రపంచ రికార్డు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్ మెన్ ల జాబితాలో రెండవ స్థానానికి ఎగబాకాడు రోహిత్ శర్మ. ఇటీవల వెస్టిండీస్తో జరిగిన నాలుగో టి20 మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు. ఏకంగా మూడు సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకు 477 సిక్సర్లు బాదాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదిని అధిగమించాడు రోహిత్ శర్మ.


 మొన్నటివరకు అంతర్జాతీయ క్రికెట్ లో ఎక్కువ సిక్సర్లు బాదిన బ్యాట్స్ మెన్ ల జాబితాలో 476 సిక్సర్లతో రెండవ స్థానంలో కొనసాగాడు. కానీ ఇప్పుడు మాత్రం అన్ని ఫార్మాట్లలో కూడా 477 సిక్సర్లు  సాధించిన రోహిత్ శర్మ షాహిద్ అఫ్రిదీ ని వెనక్కి నెట్టాడు. అయితే ఈ జాబితాలో వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.  అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో 553 సిక్సర్లు బాది ఇక అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ గా నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు క్రిస్ గేల్. కాగా నాలుగో టి20 మ్యాచ్ లో విజయం సాధించిన టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: