ఇటీవలి కాలంలో వరుస పర్యటనలకు వెళ్తూ సిరీస్ ల వేట కొనసాగిస్తున్న టీమిండియా ఇప్పుడు జింబాబ్వే పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే వరుస సిరీస్లలో విజయం సాధించి ఎంతో పటిష్టంగా కనిపించిన టీమిండియా.. జింబాబ్వే జట్టు పై పూర్తి ఆధిపత్యం కనబరచడం తథ్యం అని విశ్లేషకులు బల్ల గుద్ది మరీ చెప్పారు. ఇక క్రికెట్ విశ్లేషకుల చెప్పినట్లుగానే ప్రస్తుతం టీమిండియా మొదటి వన్డే మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకుంది.


 ఒక్క వికెట్ కూడా పడకుండానే జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించింది టీమిండియా బ్యాటింగ్ విభాగం.  భారత జట్టును విజయతీరాలకు వైపు నడిపించింది అని చెప్పాలి. ముఖ్యంగా ఎన్నో రోజుల తర్వాత పునరాగమనం చేసిన దీపక్ చాహర్ మరోసారి తన మార్కును చాటుకున్నాడు. ప్రత్యర్థి  టాప్ ఆర్డర్ను మొత్తం కుప్పకూల్చి జింబాబ్వే నడ్డి విరిచాడు అని చెప్పాలి. ఇక ఇప్పటికే టీమిండియా తరఫున విజయవంతమైన శిఖర్ ధావన్- గిల్ జోడి మరోసారి అవకాశం దక్కించుకొని అదరగొట్టింది అని చెప్పాలి. అయితే ఓపెనర్లు ఇద్దరూ అర్థసెంచరీలు చేసినప్పటికీ వారి కంటే ఎక్కువ దీపక్ చాహర్ వేసిన బౌలింగ్ మాత్రం మ్యాచ్ లోనే హైలెట్ గా నిలిచింది.


 ఈ మ్యాచ్లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు 40.3 ఓవర్లలో 189 పరుగులు మాత్రమే చేయగలిగింది.  ఇక ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన భారత జట్టు ఎంతో ఆచితూచి ఆడుతూ 30.5 ఓవర్లలోనే ఒక్క వికెట్ కోల్పోకుండా 192 పరుగులు చేసి విజయం సాధించింది.  భారత ఓపెనర్ గిల్ 72 బంతుల్లో 82 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడం గమనార్హం. మరో ఓపెనర్ శిఖర్ ధావన్  113 బంతుల్లో 81 పరుగులు చేశాడు. ఇక ఇద్దరే లక్ష్యాన్ని ఛేదించడం పట్ల ప్రస్తుతం ప్రశంసలు అందుకుంటున్నారు  అని చెప్పాలి. ఇక దీపక్ చాహర్  ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: