ప్రస్తుతం భారత క్రికెట్ లో ఒకే విషయం గురించి చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అదే భారత జట్టులో స్టార్ బౌలర్ గా ఉన్న బుమ్రా గాయం బారినపడి టి20 వరల్డ్ కప్ కు దూరం అయ్యాడు అని. క్రికెట్ ప్రేక్షకుల దగ్గర నుంచి మాజీ క్రికెటర్ల వరకు కూడా ప్రతి ఒక్కరు ఇదే విషయంపై స్పందిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే బుమ్రా లేకుండా అటు టీమిండియా జట్టు ఎంతో బలహీనంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు.

 బుమ్రా లాంటి ఆటగాడు జట్టుకు దూరం అవడం నిజంగా టీమిండియా కు ఎదురు దెబ్బ అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బుమ్రా దూరమైన నేపథ్యంలో అతని స్థానంలో హైదరాబాద్ ఫేసర్ మహమ్మద్ సిరాజ్ ను ఎంపిక చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ  క్రమంలోనే మహమ్మద్ షమిని ఎంపిక చేయాలంటూ కొంతమంది సూచనలు కూడా చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో బుమ్రా గాయంపై బిసిసిఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు.


 గాయం బారిన పడి చివరికి బుమ్రా వరల్డ్ కప్కు దూరమయ్యాడు అంటూ వార్తలు వస్తుండగా ఇక ఇదే విషయంపై స్పందించాడు సౌరవ్ గంగూలీ. టి20 వరల్డ్ కప్ కు బుమ్రా ఇంకా దూరం కాలేదు. ఎందుకంటే టి20 వరల్డ్ కప్ ప్రారంభం కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పుడే ఏవేవో ఊహించుకొని నిర్ణయాలు తీసుకోకండి అంటూ సౌరబ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. అయితే బుమ్రా వెన్నునొప్పి కాయం కారణంగా దాదాపు కొన్ని నెలల రెస్ట్ అవసరమని టి20 వరల్డ్ కప్ కు దూరమయ్యాడని వార్తలు రాగా బీసీసీఐ మాత్రం దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఇప్పుడు సౌరబ్ గంగూలీ వ్యాఖ్యలతో మరోసారి అభిమానులు అందరూ కూడా  కన్ఫ్యూజన్లో మునిగిపోయారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: