అక్టోబర్ 16వ తేదీ నుంచి ఎంతో హోరాహోరీగా జరుగుతూ వచ్చిన వరల్డ్ కప్ ప్రస్తుతం చివరి అంకానికి చేరుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక నేడు రేపు రెండు సెమి ఫైనల్ మ్యాచ్ లు జరగబోతున్నాయ్. ఇక సెమి ఫైనల్ మ్యాచ్లు ముగిసిన వెంటనే.. అక్టోబర్ 13వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. ఇక సెమి ఫైనల్లో గెలిచిన రెండు జట్లు కూడా ఫైనల్ లో అడుగుపెడుతూ ఉంటాయి. ఇక అక్టోబర్ 13వ తేదీన జరగబోయే ఫైనల్ పోరులో హోరాహోరీగా తలబడి  విశ్వ విజేతగా నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయని చెప్పాలి. అయితే ప్రస్తుతం వరల్డ్ కప్ చివరి అంకానికి చేరుకున్న నేపథ్యంలో ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలవబోయే జట్టు ఏది అన్న విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు తమ రివ్యూలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.


 ఈ క్రమంలోనే ఇలా ఎంతో మంది మాజీ ఆటగాళ్ళు చెబుతున్న రివ్యూలు కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. అంతేకాదు ఇక ప్రేక్షకులు అందరిలో కూడా అంచనాలను పెంచేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల ఇదే విషయంపై దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఎబి డివిలియర్స్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో అటు భారత జట్టు విజేతగా నిలుస్తుంది అంటూ ఎబి డివిలియర్స్ జోష్యం చెప్పాడు అని చెప్పాలి. ఇటీవల క్రీడా చానల్ తో మాట్లాడిన ఎబి డివిలియర్స్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు..


 నవంబర్ 13వ తేదీన మేల్బోర్న్ స్టేడియంలో జరగబోయే ఫైనల్ మ్యాచ్లో భారత్,న్యూజిలాండ్ జట్లు తలపడే అవకాశం ఉంది అంటూ అంచనా వేశాడు ఏబి డివిలియర్స్. టీమిండియా కప్ గెలుస్తుంది అంటూ జోష్యం చెప్పాడు.  టీమ్ ఇండియాలో చాలా ప్రతిభవంతులైన ఆటగాళ్లు ఉన్నారు. అందరూ చక్కగా ఆడుతున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ సూర్య కుమార్ యాదవ్ భీకరమైన ఫామ్ లో ఉన్నారు. అయితే ఈ వరల్డ్ కప్ టోర్నీలో రోహిత్ శర్మ ఆశించినన్ని పరుగులు చేయలేదు.  కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో రోహిత్ అదరగొడతాడు అని ఎబి డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Abd