బట్లర్, హేల్స్ లతో ఓపెనింగ్ దుర్బేధ్యంగా ఉంది.. వీరిద్దరూ నిన్నటిలాగా ఆడితే మొదటి బ్యాటింగ్ అయినా , ఛేజింగ్ అయినా వీరికి తిరుగుండదు. ఒకవేళ వీరు కనుక ఫెయిల్ అయితే.. ఫిలిప్ సాల్ట్ , బెన్ స్టోక్స్, మొయిన్ అలీ మరియు హరీ బ్రూక్ లతో మిడిల్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. లివింగ్స్టన్ , సామ్ కర్రన్, జోర్డాన్ లు ఎటువంటి పరిస్థితిలో అయినా జట్టును గెలిపించగల సమర్థులు. ఇక బౌలింగ్ గురించి చెప్పుకోవాలంటే వరల్డ్ లోనే ది బెస్ట్ పేస్ అటాక్ ఇంగ్లాండ్ కు ఉంది. ఇక స్పిన్ తో అదిల్ రషీద్ ఆకట్టుకుంటున్నాడు. పాకిస్తాన్ అదృష్టవశాత్తూ సెమీఫైనల్ కు చేరుకొని బ్యాడ్ లక్ వెన్నంటే ఉన్న కివీస్ ను అయితే ఓడించింది. కానీ ఇంగ్లాండ్ పై తమ పాచికలు పారేలా లేవు. బ్యాటింగ్ లో అంత ఊపు ఉండదు, బౌలింగ్ లో కాస్త పర్వాలేదు.
ఇక ఫీల్డింగ్ లో కీలకమైన మ్యాచ్ లలో క్యాచ్ లు వదిలేసే అలవాటున్న పాకిస్తాన్ ఆటగాళ్లు ఎప్పుడు ఎలా ఆడుతారు అన్నది చెప్పడం కాస్త కష్టమే. ఫైనల్ మ్యాచ్ కు అభిమానుల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంది. వాస్తవంగా అందరూ నిన్న ఇండియా గెలిచి ఫైనల్ కు ఇండియా వెళుతుంది అని ఊహించారు. కానీ ఆలా జరగకపోవడంతో ఆస్ట్రేలియా లో ఉన్న భారత అభిమానులు మ్యాచ్ ను లైవ్ గా చూడడానికి ఇష్టపడే అవకాశం చాలా తక్కువ. మరి ఫైనల్ మ్యాచ్ లో భారత అభిమానుల సపోర్ట్ ఈ రెండు జట్లలో ఎవరికి ఉంటుంది అంటే... ఎక్కువ మంది నుండి వినిపిస్తున్న ప్రకారం ఇంగ్లాండ్ కే మద్దతు పలికే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ కు ఎప్పుడూ భారత అభిమానులు మద్దతు పలికే ఛాన్స్ లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి