సాధారణంగానే భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక వచ్చే ఏడాది కూడా అనుకున్న సమయానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహించాలి అని భావిస్తున్న బీసీసీఐ... ఇక 2023 ఐపీఎల్ సీజన్ కోసం ఇప్పటినుంచి అన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవలే రిటెన్షన్ ప్రక్రియను పూర్తి చేసిన బీసీసీఐ మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ కోసం మినీ వేలం ప్రక్రియను ప్రారంభించబోతుంది. ఈ క్రమంలోనే ఈ మినీ వేలంలో ఎంతో మంది స్టార్ ప్లేయర్స్ కూడా ఉండడం గమనార్హం.


 ఈ క్రమంలోనే ఇక కొంతమంది ఆటగాళ్లను కొనుగోలు చేసి ఇక తమ జట్టును ఎంతో పటిష్టవంతంగా మార్చుకునేందుకు అన్ని ఫ్రాంచైజీలు కూడా ప్రణాళికల సిద్ధం చేసుకున్నయి అని చెప్పాలి. ఇక ఈనెల 23వ తేదీన కొచ్చి వేదికగా మినీ వేలం జరగబోతుంది. అయితే ఇక ఈ మినీ వేలంలో పాల్గొనేందుకు ఎంతో మంది విదేశీ ఆటగాళ్లు స్వదేశీ ఆటగాళ్లు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇక ఈ వేలంలో భాగంగా ఎంతో మంది కొత్త ఆటగాళ్లు కూడా అటు వివిధ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పాలి.



 ఇకపోతే ఈనెల 23వ తేదీన కొచ్చి వేదికగా జరగబోయే మినీ వేలంకి సంబంధించి వివరాలను ప్రకటించింది బీసీసీఐ. ఇక ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే 2023 ఐపీఎల్ సీజన్ కోసం ఏకంగా 991 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారట. ఇక వీరిలో 714 మంది భారతీయులు ఉంటే 277 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు అని భారత క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఇందులో అత్యధికంగా ఆస్ట్రేలియాకు చెందిన క్రికెటర్లే ఎక్కువగా (57) ఉన్నారట. కాగా క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా మినీ వేలం ప్రక్రియ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl