ఇక ఈ మ్యాచ్ లో భాగంగా ఎప్పటిలాగానే ఉమ్రాన్ మాలిక్ తన ఫాస్ట్ బౌలింగ్ తో అదరగొట్టాడు.. ఏకంగా అందరికంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు అని చెప్పాలి. మ్యాచ్ మొత్తంలో మూడు వికెట్లు తీసి ఔరా అనిపించాడు. ఒకరకంగా తన బౌలింగ్ తో ప్రత్యర్థి శ్రీలంక నడ్డి విరిచాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే 14 ఓవర్ లో ఉమ్రాన్ మాలిక్ వేసిన నాలుగోబంతి 156 కిలోమీటర్ల వేగంతో వేయడం గమనార్హం. దీంతో అత్యంత వేగంగా బంతిని సందించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అయితే ఈ బంతి విషయంలో ప్రస్తుతం కాంట్రవర్సీ తెరమీదికి వచ్చింది.
అయితే ఇంగ్లీష్ బ్రాడ్ కాస్టింగ్ లో మాత్రం ఈ విషయం అసలు ప్రస్తావనికే రాలేదు అనే విషయం తెలిసిందే. హిందీలో 156 కిలోమీటర్ల వేగం గుర్తించిన అదే డెలివరీ ని ఇంగ్లీష్ బ్రాడ్ కాస్టింగ్ లో మాత్రం కేవలం 145.7 కిలోమీటర్ల వేగం మాత్రమే చూపించారు. దీంతో అభిమానులు దేన్నీ నమ్మాలో తెలియక.. కన్ఫ్యూషన్ లో పడిపోయారు అని చెప్పాలి. దీంతో ఇటీవలే ఉమ్రాన్ మాలిక్ 156 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి భారత క్రికెట్లో ప్రత్యేకమైన రికార్డు సాధించగా.. అసలు ఆ బంతి లెక్కలోకి వస్తుందా లేదా అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిపోయింది అని చెప్పాలి.