టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ గత కొంతకాలం నుంచి మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు అని చెప్పాలి. మంచి ఆరంభాలు ఇస్తున్నప్పటికీ ఇక తన స్కోరును భారీ స్కోరుగా మలచడంలో మాత్రం విఫలమవుతున్నాడు. దీంతో రోహిత్ శర్మ సెంచరీ చేయక దాదాపు మూడేళ్లు గడిచిపోతున్నాయి. ఇలాంటి సమయంలో రోహిత్ కి జోడిగా బరిలోకి దిగుతున్న యువ ఆటగాళ్లు డబుల్ సెంచరీలతో చెలరేగిపోతూ ఉండడం గమనార్హం. మొన్నటికి మొన్న న్యూజిలాండ్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో శుభమన్ గిల్ 149 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేశాడు.


 న్యూజిలాండ్ బౌలర్లు ఎక్కడ బంతి వేసిన సిక్సర్లు  ఫోర్లు కొట్టడమే లక్ష్యంగా బ్యాట్ జులిపించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే సొగసైన షాట్లు ఆడుతూ ప్రేక్షకులు అందరిని కూడా మైమరిపించాడు. ఇక ఎంతో అలవోకగా డబుల్ సెంచరీ సాధించి ఎన్నో ప్రపంచ రికార్డులను కొల్లగొట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవలే రెండో వన్డే మ్యాచ్ కి ముందు రోహిత్ శర్మకు శుభమన్ గిల్ నుండి ఒక ప్రశ్న ఎదురవ్వగా.. ఆసక్తికర సమాధానం చెప్పాడు. మీతో పాటు ఓపెనింగ్ చేస్తున్న యువ ఆటగాడు శుభమన్ గిల్ డబుల్ సెంచరీ స్కోర్ చేశాడు. అతను అలా బ్యాటింగ్ చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అంటూ ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పాడు.


 శుభమన్ గిల్ ఒక గొప్ప ఆటగాడు అతను బ్యాటింగ్ చేస్తూ ఉంటే మరో ఎండ్ లో నిలబడి అలాగే చూస్తూ ఉండాలి అనిపిస్తూ ఉంటుంది అంటూ కెప్టెన్ రోహిత్ శర్మ యువ ఆటగాడి పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక అతను చేసిన డబుల్ సెంచరీ కూడా అద్భుతం. అతని షాట్ సెలక్షన్ బాగుంది. క్రీజు లో పాతుకుపోయిన తీరు కూడా నాకు బాగా నచ్చింది అంటూ ప్రశంసలు కురిపించాడు. అయితే ఇలా ఒక ఓపెనర్ అయ్యుండి మరో ఓపెనర్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ పై అటు అభిమానులు కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: