
ఈ క్రమంలోనే అటు టీమిండియా వరుస విజయాలకు బ్రేక్ పడింది అని చెప్పాలి. అయితే టీమిండియా జట్టు ఓడిపోయినప్పటికీ అటు కొంతమంది ఆటగాళ్ల ప్రదర్శన మాత్రం అభిమానుల దృష్టిని ఆకర్షించింది అని చెప్పాలి. అదే సమయంలో కొంతమంది ఆటగాళ్లు టీమిండియాలో అవకాశం దక్కించుకొని చివరికి ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయారు. అయితే ఇది కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఒక్క మ్యాచ్ ప్రదర్శన ఆధారంగా ఎవరి ప్రదర్శనను అంచనా వేయలేము అంటూ వాషింగ్టన్ సుందర్ మాట్లాడాడు.
ఈ క్రమంలోనే అక్కడే మీడియా సమావేశంలో ఉన్న ఒక రిపోర్టర్ నుంచి తిక్క ప్రశ్న ఎదురైంది అని చెప్పాలి. మొదటి టి20 మ్యాచ్ లో ఓడిపోయారు. టాప్ ఆర్డర్ ను మార్చాల్సిన అవసరం ఉందంటారా అంటూ ప్రశ్నించగా.. నిజంగా టాప్ పార్ట్ మార్చాల్సిన అవసరం ఉందంటారా.. ఒక విషయం చెబుతున్న.. రెస్టారెంట్ నుంచి మనకు కావాల్సిన ఫేవరెట్ బిర్యాని రాకపోతే రెస్టారెంట్ కి వెళ్లడం పూర్తిగా మానేయలేం కదా. ఇది కూడా అలాంటిదే. కేవలం ఒక్క మ్యాచ్లో ఒక రోజులో ముగిసిపోయే మ్యాచ్లో ఏదో ఒక జట్టు మాత్రమే నెగ్గుతుంది. ఇక ఇరు జట్లలో ఉండే 22 మంది ఆటగాళ్లు ఒకే రకమైన ప్రదర్శన చేయలేరు అంటూ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడు వాషింగ్టన్ సుందర్.