క్రికెట్ క్రీడకి ప్రపంచ వ్యాప్తంగా వున్న ఆదరణ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రీడను తిలకించడానికి స్టేడియంలో జనాలతోపాటు కొన్ని కోట్ల సంఖ్యలో TVలు, మొబైల్స్ లో సిద్ధంగా వుంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలో ఓ మ్యాచ్ లో జరుగుతున్న అన్ని విషయాలను చాలా జాగ్రత్తగా చూస్తూ వుంటారు. ఇకపోతే అలాంటి ఆటలో అంపైర్ల పాత్ర ఎంత కీలకమో చెప్పాల్సిన పనిలేదు. బౌలర్ ఎన్ని బంతులు వేస్తున్నాడు, ఎలా వేస్తున్నాడు, బ్యాటర్లు పరుగులు తీసే క్రమంలో క్రీజు దాకా వెళ్తున్నారా? వైడ్ బాల్స్, నో బాల్స్, సిక్సర్లు, బౌండరీలు, క్యాచ్లు, ఎల్బీలు ఇలా చెప్పుకుంటూ పెద్ద లిస్ట్ అవుతుంది కానీ... సదరు విషయాలను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి.

అదే అంపైర్ చేయవలసిన పని. ఒక్కోసారి ఆటగాళ్ల మధ్య గొడవలు చోటుచేసుకుంటే అందులో కల్పించుకొని గొడవలు సద్దుమణిగేలా చేయడం కూడా వారి పనే. అలాంటి అంపైర్ నిర్లక్ష్యం వహించడం ఎప్పుడైనా చూశారా? దాదాపు జరగదు కదూ. కానీ తాజాగా ఓ అంపైర్ బాధ్యతారాహిత్యంతో అంపైరింగ్ చేయకుండా దిక్కులు చూస్తూ ఉండడం సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మ్యాచులో జరిగింది. అవును, ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. లెగ్ అంపైర్ మరాయిస్ ఎరాస్మస్ బౌలర్ వేసిన బంతిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకోవడం కనిపించింది.

అక్కడ గేమ్ జరుగుతుండగా తనకి ఏమీ సంబంధం లేదన్నట్టుగా ఎరాస్మస్ వెనక్కి తిరిగి చేతితో ఏదో లెక్కబెడుతున్నట్లు ఇక్కడ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. అదే సమయంలో అన్రెచ్ నోర్హే బంతి వేయడం.. క్రీజులో ఉన్న జేసన్ రాయ్ షాట్ కొట్టడం జరిగిపోయాయి. ఇక ఇంగ్లండ్ బ్యాటర్లు పరిగెత్తే సమయంలో అంపైర్ ఎరాస్మస్ అప్పుడే మేల్కొన్నట్లు ముందుకు తిరగడం ఇక్కడ కనబడుతోంది. దీనికి సంబంధించిన వీడియోనూ ట్విటర్లో ఓ యువకుడు షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు "క్రికెట్ అంపైరింగ్ పై ఆసక్తి లేకపోతే ఇంట్లో రెస్టు తీసుకోవాలిగాని, ఏంటీ పని?" అంటూ సదరు అంపైర్ కు చురకలు అంటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: