ఇపుడు ఎక్కడ చూసినా, విన్నా t20 లీగ్స్ హడావుడే కనబడుతోంది. తాజాగా దక్షిణాఫ్రికా t20 లీగ్ జరుగుతున్న క్రమంలో మిస్టర్ 360 ఆటగాడుగా పేరు పొందిన AB డివిలియర్స్ పలు అంశాలపై స్పందించాడు. ఇక ABD IPLలో RCB (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) తరపున మనోడు ఆడిన విషయం తెలిసిందే. ABD దక్షిణాఫ్రికా ఆటగాడిగానే కాకుండా.. IPLలో కూడా అదరగొట్టడంతో మన భారత అభిమానులకు కూడా చేరువయ్యాడు. మైదానం నలువైపులా క్రికెటింగ్ షాట్లను కొట్టే టాలెంట్ ABD సొంతం. కావున ABDని అభిమానులు 'మిస్టర్ 360'గా పిలుచుకుంటారు.

2018లో మనోడు అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికిన సంగతి తెలిసినదే కదా. ఈ క్రమంలో క్రికెట్ షెడ్యూలింగ్ విషయాలకు సంబంధించి ABD కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం కొసమెరుపు. ప్రపంచ వ్యాప్తంగా లీగ్ లు రావడంతో ఆటగాళ్లు ఫార్మాట్ల ఎంపికలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నాడు ABD. గత సంవత్సరం ఇంగ్లాండ్ ఆటగాడు అయినటువంటి 'బెన్ స్టోక్స్' వన్డేలకు వీడ్కోలు చెప్పడం అనే అంశంపై ఎదురైన ప్రశ్నకు డివిలియర్స్ ఈ విధంగా స్పందించాడు. మంచి ఫామ్ కొనసాగిస్తున్న బెన్టేక్స్ అలా వన్డే ఫార్మాట్ వదిలేయడానికి క్రికెట్ షెడ్యూలింగ్ ఒక కారణం అయి ఉంటుందని అన్నాడు.

ఈ బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లు మానసికంగా, శారీరకంగా తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురికావలసి ఉంటుంది. అంతర్జాతీయ ఆటలో కూడా ఇదే సమస్య. క్రికెటర్లను తమ జాతీయ జట్టు తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడేలా స్ఫూర్తి నింపాల్సిన బాధ్యత ఆయా క్రికెట్ బోర్డులపై ఎంతైనా వుంది. అందుకే తొలుత ఆటగాళ్లతో మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటే ఉత్తమం. వారు ఏ ఏ ఫార్మాట్స్ లో సరిపోతారు? ఎలాంటి టార్గెట్స్ పెట్టుకున్నారు? అనే విషయాలపై అవగాహన తెచ్చుకోవాలి. అన్నింటికంటే ముందుగా దేశం కోసం ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తర్వాత లీగుల్లో ఆడటంపై ఏమాత్రం అభ్యంతరం ఉండదు. అని బోర్డు మెంబర్లకు చురకలు అంటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Abd