
టి20 సిరీస్ కు కొత్త వైభవం తెచ్చేందుకే అతను పుట్టాడేమో అనే విధంగా అతని ఆట తీరు కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. మ్యాచ్ ఏదైనా సరే ప్రత్యర్థి ఎవరైనా సరే తనకు బౌలింగ్ చేస్తుంది ఎంతటి స్టార్ బౌలర్ అయిన సరే కూడా పట్టించుకోకుండా తన బ్యాటింగ్ విధ్వంసాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు సూర్య కుమార్ యాదవ్. ఇక ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే సూర్య కుమార్ ఒత్తిడికి గురి కావడం లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక టి20 ఫార్మాట్లో అద్భుతమైన ప్రదర్శనతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి.
ఇలా గత కొంతకాలం నుంచి టి20 ఫార్మాట్లో అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతున్న సూర్య కుమార్ యాదవ్ అటు ప్రపంచ క్రికెట్లో కూడా ఎన్నో అరుదైన రికార్డులు కొల్లగొడుతున్నాడు అని చెప్పాలి. ఇక ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టి20 మ్యాచ్ లో భాగంగా కీలక సమయంలో తన బ్యాట్ తో మెరుపులు మెరుపుంచిన సూర్య కుమార్ చివరికి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అయితే టి20 క్రికెట్లో 11 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్ధులను వేగంగా అందుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. సూర్య కుమార్ కు కేవలం 11 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు అందుకునేందుకు 47 మ్యాచ్లు పట్టింది. ఇక మహమ్మద్ నబి 68 మ్యాచ్ లు, విరాట్ కోహ్లీ 71 మ్యాచ్లు, ఇక బాబర్ కి 79 మ్యాచులు ఇక 11 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు అందుకునేందుకు సమయం పట్టింది అని చెప్పాలి.