
అదే సమయంలో ఇక ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న ఆస్ట్రేలియాను ఓడించడం అంత సులభమైన విషయమేమీ కాదు. ఇక మరోవైపు ఇక సొంతగడ్డపై టీమిండియాని ఓడించడం కూడా ఆస్ట్రేలియాకు ఒక పెద్ద సవాల్ లాంటిదే. దీంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఉండబోతుంది అన్నది అర్థమవుతుంది. అయితే ఇక ఈ టెస్ట్ సిరీస్ పై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ తమ రివ్యూలను సోషల్ మీడియా వేదికగా చెప్పేస్తూ ఉన్నారు. అయితే గత కొంతకాలం నుంచి కోహ్లీ, శుభమన్, గిల్.. ఫేస్ గన్ ఉమ్రాన్ మంచి ఫామ్ లో ఉండడంతో ఇక వీళ్ళే ఆస్ట్రేలియాకు అసలైన సవాలు అని అందరూ అనుకుంటున్నారు.
కానీ వీళ్లు కాదు ఆస్ట్రేలియాకు అసలైన సవాల్ వేరే ఆటగాడితో ఉంది అంటూ ఇటీవలే ఒక వార్త బయటకు వచ్చింది. భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ పైనే ఆస్ట్రేలియా జట్టు దృష్టి పెట్టింది అంటూ ప్రస్తుతం పలువురు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్లో అక్షర్ పటేల్ 27 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఈ క్రమంలోనే అక్షర్ పటేల్ బౌలింగ్ వీడియోలు తెప్పించుకొని మరి ఆస్ట్రేలియా కోచింగ్ విభాగం వీక్షిస్తుందట. అంతేకాదు టెస్ట్ ఫార్మాట్లో అక్షర్ పటేల్ ఆస్ట్రేలియా తొలిసారి ఎదుర్కొంటూ ఉండడంతో ఇక మరింత జాగ్రత్త పడుతూ ఉన్నట్లు తెలుస్తోంది.