క్రికెట్ పరీక్షకులందరూ ఎదురుచూస్తున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. ఇక ఇందులో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ నాగపూర్ వేదికగా జరగబోతుంది అని చెప్పాలి.  ఈ క్రమంలోనే భారత తుది జట్టులోకి ఎవరు రాబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇక భారత్లో ఉండే పిచ్ లలో కాస్త టర్నింగ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక ఎక్కువగా స్పిన్నర్లకే పెద్ద పీట వేసే అవకాశం ఉంది. దీంతో జట్టులో ఫాస్ట్ బౌలర్ల కంటే స్పిన్నర్లు ఎక్కువగా కనిపించే ఛాన్స్ ఉంది.


 అయితే ప్రస్తుతం స్పిన్నర్ల విషయంలో కూడా టీమ్ ఇండియాకు ఎన్నో ఆప్షన్లు ఉన్న నేపథ్యంలో ఎవరు తుది జట్టులోకి వచ్చి అదరగొడతారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే రవీంద్ర జడేజా ఒక వైపు స్పిన్ బౌలింగ్ తో పాటు మరోవైపు బ్యాటింగ్ తో కూడా అదరగొడతాడు. ఇక జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈ ఆల్ రౌండర్ కి తప్పక తుది జట్టులో ఛాన్స్ దక్కుతుంది. ఇక మరోవైపు ఆస్ట్రేలియా పై మంచి రికార్డు ఉన్న అశ్విన్ సైతం సమయం వచ్చినప్పుడు బ్యాట్ తో కూడా రానిస్తాడు. దీంతో అతని చోటు కూడా సుస్థిరం అయినట్లే అని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


 ఈ క్రమంలోనే టీమ్ ఇండియాలో మూడవ స్పిన్నర్ గా ఎవరైతే బాగుంటుంది అనే దానిపై క్రికెట్ పండితులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.  ఇదే విషయంపై టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి మాట్లాడుతూ మూడవ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ ను తీసుకుంటే బాగుంటుంది అంటూ అభిప్రాయపడ్డాడు. టాస్ ఓడిపోయి బంతిని స్పిన్ చేయాలనుకుంటే తొలి రోజు నుంచి బంతిని తిప్పగలిగేది కేవలం కుల్దీప్ యాదవ్ మాత్రమే అంటూ రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు. భారత స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా ప్రణాళిక బద్ధంగానే సిద్ధమైంది అంటూ చెప్పుకొచ్చాడు. స్పిన్ ఎదుర్కొనేందుకు ముమ్మర సాధన చేసింది అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: