ప్రస్తుతం రోహిత్ శర్మ టీం ఇండియాకు మూడు ఫార్మాట్లకు కూడా కెప్టెన్ గా కొనసాగుతూ ఉన్నాడు అనే విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ సారాధ్య బాధ్యతలు నుంచి తప్పుకున్న తర్వాత అటు రోహిత్ శర్మ క్రమక్రమంగా మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ అందుకున్నాడు అని చెప్పాలి. అయితే మూడు ఫార్మాట్లకు కెప్టెన్ అయితే అయ్యాడు. కానీ విరాట్ కోహ్లీ లాగా మూడు ఫార్మాట్లకు కూడా అతను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండటం చాలా తక్కువ. అయితే విరాట్ కోహ్లీ లాగా పూర్తిస్థాయి ఫిట్నెస్ లేకపోవడంతోనే రోహిత్ శర్మ కేవలం ఏదో ఒక ఫార్మాట్ కి మాత్రమే అందుబాటులో ఉంటున్నాడని మిగతా ఫార్మాట్లకు దూరంగా ఉంటున్నాడని విమర్శలు కూడా వచ్చాయి .


 ఈ క్రమంలోనే రోహిత్ శర్మ ఫిట్నెస్ను కారణంగా చూపుతూ ఎంతోమంది తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు అన్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మ ఫిట్ గా లేకపోతే మరికొన్ని రోజుల్లో టీమిండియాలో చోటు కూడా కోల్పోవడం ఖాయం అంటూ అందరూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక గత కొంతకాలం నుంచి అయితే మ్యాచ్ లలో రోహిత్ శర్మ మరింత లావుగా కనిపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక  అయితే కెప్టెన్గా అతను సక్సెస్ అవుతున్నప్పటికీ ఫిట్నెస్ విషయంలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అభిమానులు కూడా భావిస్తూ ఉన్నారు.



 ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. రోహిత్ శర్మ గొప్ప ఆటగాడు కానీ అతడు ఫిట్నెస్ గురించి మాట్లాడాల్సి వస్తే మాత్రం అతను టీవీలో చూసినప్పుడు ఎంతో లావుగా కనిపిస్తాడు. దీనిపై అతను హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆటగాళ్లకు ఫిట్నెస్ ఎంతో అవసరం. మరి ముఖ్యంగా కెప్టెన్లకు ఇంకా అవసరం. విరాట్ కోహ్లీ ఎప్పుడు ఫిట్నెస్ మెయింటైన్ చేస్తాడు అంటూ కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు. కాగా కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: