ప్రస్తుతం వెస్ట్ ఇండీస్ జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్లు రెండు టెస్ట్ లు , మూడు వన్ డే లు మరియు మూడు టీ 20 లు ఆడాల్సి ఉంది. కాగా ఇప్పటికే రెండు టెస్ట్ ల సిరీస్ ను ఆతిధ్య సౌత్ ఆఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. కానీ వన్ డే సిరీస్ లో మాత్రము మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, మిగిలిన రెండు వన్ డే లలో చెరొకటి గెలవడంతో సిరీస్ డ్రా అయింది. ఇక మిగిలిన టీ 20 సిరీస్ లో నిన్న రాత్రి సౌత్ ఆఫ్రికా మరియు వెస్ట్ ఇండీస్ జట్ల మధ్యన సెంచూరియన్ వేదికగా జరిగింది.

మొదట టాస్ గెలిచిన వెస్ట్ ఇండీస్ కొత్త కెప్టెన్ రావమన్ పావెల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే మ్యాచ్ మధ్యలో వర్షం రావడంతో ఇన్నింగ్స్ ను ఇరు జట్లకు 11 ఓవర్లుగా కుదించారు. టీ 20 లలో చెలరేగి ఆడే ఆటగాళ్లు ఇటు జట్ల సొంతం. మొదట బ్యాటింగ్ చేసిన మార్క్ రామ్ సేన మొదట్లో స్టార్ ఆటగాడు డికాక్ డక్ అవుట్ అయినా... తలో చేయి వేయడంతో 11 ఓవర్లకు సౌత్ ఆఫ్రికా 131 పరుగులు చేసింది. సౌత్ ఆఫ్రికా ఈ మాత్రం స్కోర్ చేసిందంటే కారణం మిల్లర్ చేసిన 48 పరుగుల ఇన్నింగ్స్ కారణం అని చెప్పాలి.

వెస్ట్ ఇండీస్ బౌలర్లలో కాట్రేల్ 2 మరియు ఒడియన్ స్మిత్ 2 వికెట్లు తీసుకున్నారు. ఛేదనను పరుగుల లక్ష్యంతో ఆరంభించిన విండీస్ కు ఓపెనర్ కింగ్ సరైన ఆరంభాన్ని అందించాడు. ఇతను కేవలం 8 బంతుల్లో 23 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత చార్లెస్ (28) మరియు పూరన్ (16) లు వేగంగా ఆడి టీం ను రేస్ లో ఉంచారు. అయితే వరుసగా విండీస్ వికెట్లు కోల్పోయి ఓటమి కొనితెచ్చుకునే పరిస్థితుల్లో కెప్టెన్ పావెల్ విద్వంసాన్ని సృష్టించాడు. ఇతను కేవలం 18 బంతులు మాత్రమే ఆడి 5 సిక్సులు మరియు 1 ఫోర్ సాయంతో 238 స్ట్రైక్ రేట్ తో 43 పరుగులు చేసి మరో మూడు బంతులు ఉండగానే విండీస్ ను గెలిపించి సిరీస్ లో 1-0 ఆధిక్యాన్ని తీసుకువచ్చాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: