
ఐపీఎల్ ప్రారంభమై కొన్ని మ్యాచ్లు గడిచేంతవరకు కూడా అటు ప్రేక్షకులు కూడా ఏ జట్టు ప్లే ఆఫ్ కు వెళ్తుంది.. ఇక ఎవరూ ఫైనల్ లో నిలుస్తారు అనే విషయంపై క్లారిటీ రాదు అని నమ్ముతుంటే.. అటు ఐపిఎల్ లో మొదటి మ్యాచ్ కూడా ప్రారంభం కాకముందే ఎంతోమంది మాజీ ఆటగాళ్లు ఇక ఐపీఎల్ టైటిల్ గెలిచే జట్టు ఏది అనే విషయంపై ముందే ఒక అంచనాకు వచ్చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇలా మాజీ ఆటగాళ్లు ఇస్తున్న రివ్యూలు కాస్త సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. ఇక ఇటీవలే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సైతం ఇదే విషయంపై రివ్యూ ఇచ్చేశాడు.
గత ఏడాది అద్భుతమైన ప్రదర్శన చేసి రన్నరప్ గా నిలిచిన రాజస్థాన్ జట్టు ఇక 2023 ఏడాది ఐపీఎల్ లో టైటిల్ విన్నర్ గా నిలుస్తుంది అంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకల్ వాన్ అంచనా వేశాడు. గత ఏడాది ఫైనల్ వరకు వెళ్లి ఒక్క అడుగు దూరంలో టైటిల్ గెలవలేకపోయిన రాజస్థాన్ ఈసారి టైటిల్ గెలవాలని కసితో ఉంది అంటూ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. కాగా అసలు టైటిల్ విజేత ఎవరు అన్నది మాత్రం లీక్ మ్యాచ్లు పూర్తయి మే 28వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్ తర్వాతే అందరికీ తెలుస్తుంది. మరి ఈ ఐపీఎల్ లో ఏ టీం టైటిల్ గెలుస్తుంది అని మీరు అనుకుంటున్నారు.