
ఒకవేళ బౌలర్ వేసిన బంతి వికెట్లను తాకి బెయిల్ ఎగరలేదు అంటే.. ఇక అది వికెట్ గా పరిగణించరు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి రూల్ ఎంతోమంది బ్యాట్స్మెన్ లకు అదృష్టంగా మారితే.. ఎంతోమంది బౌలర్లకు మాత్రం తలనొప్పులు తెచ్చి పెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి. కాగా ఇటీవలే ఐపీఎల్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా ఇలాంటిదే జరిగింది. ఏకంగా ఇలాంటి రూల్ కారణంగానే ఢిల్లీ జట్టు కెప్టెన్ గా ఉన్న వార్నర్ కి అదృష్టం కలిసి వచ్చింది అని చెప్పాలి. షమీ బౌలింగ్లో ఏకంగా తొలి బంతికి అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు వార్నర్.
ఏకంగా షమి వేసిన మొదటి బంతి వార్నర్ బ్యాట్ ను దాటుకుని మిడిల్ స్టంప్ అయింది. దీంతో ఆఫ్ స్టంప్ ను తాకుతూ కీపర్ చేతుల్లోకి వెళ్ళింది అని చెప్పాలి. అయితే ఇక బంతి వికెట్లను అయితే తాకింది కానీ బేయిల్స్ అయితే కాస్త కూడా కదలలేదు. దీంతో ఇక ఐసిసి రూల్స్ ప్రకారం అతను నాటౌట్ అని చెప్పాలి. ఇక ఇలా ఐసీసీ రూల్ కారణంగా అటు వార్నర్ బతికిపోయాడు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. ఇక తర్వాత 32 బంతుల్లో 37 పరుగులు చేసిన వార్నర్ జోసెఫ్ బౌలింగ్లోక్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఢిల్లీ జట్టు హోమ్ గ్రౌండ్ లోనే ఓడిపోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది అని చెప్పాలి.