ఈ ఏడాది ఐపిఎల్ సీజన్లో అన్ని జట్లను కూడా గాయాలు బెడద తీవ్రంగా వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జట్టులో ఉన్న కీలకమైన ఆటగాళ్లు దూరం అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక మరికొన్ని జట్లకు అయితే ఏకంగా కెప్టెన్ గా ఉన్న ఆటగాళ్లే గాయం బారిన పడుతూ ఉండడంతో ఇక కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఇటీవలే లక్నో సూపర్ జేయింట్స్ జట్టుకి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. గత మ్యాచ్లో లక్నో జట్టుకు కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.


 అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో అటు కేఎల్ రాహుల్ జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు అని చెప్పాలి. దీంతో గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ గాయంతో మైదానం బయటికి వెళ్ళినప్పుడు.. ఇక తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించిన కృనాల్ పాండ్య  ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్లో కూడా కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు అని చెప్పాలి.  ఇలా కృనాల్ పాండ్య కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్లో బలిలోకి దిగింది లక్నో సూపర్ జెయింట్స్ జట్టు. అయితే ఇలా కెప్టెన్ గా ఆడిన తొలి మ్యాచ్ లోనే అటు కృనాల పాండ్య చెత్త రికార్డు నమోదు చేశాడు.


 ఐపీఎల్ హిస్టరీలో పూర్తిస్థాయి కెప్టెన్గా వ్యవహరించిన తొలి మ్యాచ్ లోనే డక్ అవుట్ అయిన మూడో క్రికెటర్ గా కృనాల్ పాండ్య ఒక చెత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో కృనాల్ పాండ్య ఆడిన తొలి బంతికే డక్ అవుట్ గా వెనుతిరికాడు. అయితే గతంలో డెక్కన్ చార్జెస్ తరఫున ప్రాతినిధ్యం వహించిన వివిఎస్ లక్ష్మణ్ ఇలాగే కెప్టెన్గా వ్యవహరించినా తొలి మ్యాచ్లో డక్ అవుట్ అయ్యాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ కెప్టెన్ గా ఉన్న మార్కరమ్ సైతం తొలి మ్యాచ్లోనే ఇలా గోల్డెన్ డకౌట్ గా వెను తిరగడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl