
ఒక రకంగా చెప్పాలి అంటే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బౌలర్లు అందరికీ కూడా చుక్కలు చూపించాడు సూర్య కుమార్ యాదవ్. అయితే సూర్యకుమార్‌కు తోడుగా అటు వదెరా మంచి ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఇక ఇద్దరూ మంచి భాగస్వామ్యం నెలకొల్పడంతో అటు ముంబై ఇండియన్స్ ఎంతో అలవోకగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ ముందు ఉంచిన లక్ష్యాన్ని అత్యంత వేగంగా ఛేదించగలిగింది. అయితే ఇలా తమ బ్యాటింగ్ తో అదరగొట్టిన సూర్యకుమార్, వదెరా జోడి ఒకరుదైన రికార్డులు సృష్టించింది.
మూడో వికెట్ కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన ఆటగాళ్లుగా నిలిచారు సూర్య కుమార్ యాదవ్, వదెరా. ఇటీవల జరిగిన మ్యాచ్‌లో ఏకంగా వీరి జోడి 140 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అయితే 2013లో రోహిత్ శర్మ - దినేష్ కార్తీక్ ఢిల్లీ జట్టు పై 132పరుగులు.. 2023లో ఇషాన్ కిషన్ - సూర్యకుమార్ యాదవ్ పంజాబ్ పై 116 పరుగులు అత్యధిక భాగస్వామ్యంగా ఉండగా.. ఇక ఇటీవల అటు సూర్య కుమార్ యాదవ్ - వదెరా జోడి ఈ రికార్డును బ్రేక్ చేసింది. ఇక ఐపీఎల్ హిస్టరీలో చూసుకుంటే కేఎల్ రాహుల్ - డికాక్ జోడి చేసిన 210 పరుగుల భాగస్వామ్యం మూడో వికెట్ కు ఐపిఎల్ లొ అత్యధిక భాగస్వామ్యంగా కొనసాగుతుంది.