ప్రపంచ క్రికెట్లో పాకిస్తాన్, భారత్ జట్ల మధ్య మ్యాచ్ ఎప్పుడు జరిగిన కూడా అది హాట్ ఫేవరెట్ గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. చిరకాల ప్రత్యర్ధులుగా కొనసాగుతున్న ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగితే కేవలం రెండు దేశాల క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా కన్నారపకుండా మ్యాచ్ వీక్షించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఈ రెండు దేశాల జట్ల మధ్య క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతుంది.



 ఈ క్రమంలోనే ఇక ప్రపంచ క్రికెట్లో అన్ని దేశాలతో ఆడుతున్నట్లుగానే పాక్, భారత జట్లు ద్వైపాక్షిక సిరీస్ లు ఆడవు. కేవలం ఐసిసి టోర్నీలలో మాత్రమే తలబడుతూ ఉంటాయి. దీంతో ఇక భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే అందరిలో కూడా అంచనాలు పెరిగిపోతూ ఉంటాయి అని చెప్పాలి. అయితే 2022 టీ20 వరల్డ్ కప్ సమయంలోభారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఎక్కువ వ్యూయర్షిప్ సొంతం చేసుకున్న మ్యాచ్ గా రికార్డు సృష్టించింది. కాగా ఈ మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. అయితే కీలకమైన సమయంలో పాకిస్తాన్ స్టార్ బౌలర్ షాహిన్ ఆఫ్రిది  గాయం కారణంగా ఇక మైదానం నుంచి వెళ్లిపోవడం కూడా భారత జట్టుకు ఎంతగానో కలిసి వచ్చింది.



 ఒకవేళ మైదానంలో షాహిన్ ఆఫ్రిది ఉండి ఉంటే మాత్రం భారత జట్టుకు విజయం ఎంతో కష్టతరం అయ్యేది అని ఎంతో మంది క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కేవలం భారత్తో మ్యాచ్లో మాత్రమే కాదు అతను టోర్నీ మొత్తం దూరం కావడంతో చివరికి పాకిస్తాన్ బౌలింగ్ విభాగం బలహీనంగా మారింది. దీంతో ఇక గెలవాల్సిన ఫైనల్ మ్యాచ్లో కూడా పాకిస్తాన్ ఓడిపోయి విమర్శలు ఎదుర్కొంది. ఇక ఇటీవల ఇదే విషయంపై పాక్ బౌలర్ షాహీన్ అఫ్రిది స్వయంగా స్పందించాడు. తాను గాయపడకుండా ఉండి ఉంటే 2022 టి20 ప్రపంచకప్ ను పాకిస్తాన్ గెలిచేదని బౌలర్ షాహిన్ ఆఫ్రిది అన్నాడు. ప్రతి ఆటగాడు దేశం కోసం ప్రపంచకప్ గెలవాలని కలగంటాడు. 2022 టి20 వరల్డ్ కప్ లో నేను కీలక సమయంలో గాయపడ్డాను. నేను ఫిట్ గా ఉండి ఉంటే.. ప్రపంచ కప్ మేమే గెలిచే వాళ్ళం అంటూ చెప్పుకొచ్చాడు. కాగా అతను చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: