ప్రస్తుతం భారత జట్టు కీలకమైన మ్యాచ్ కోసం సిద్ధమైంది. 2021 లో డబ్ల్యూ టి సి ఫైనల్ కు చేరుకున్న టీమిండియా జట్టు ఇక చివరి అడుగులో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి తీవ్రంగా నిరాశపరిచింది అన్న విషయం తెలిసిందే. అయితే ఎట్టి పరిస్థితుల్లో కప్పు గెలవాలని పట్టుదలతో ఉన్న జట్టు.. వరుసగా రెండోసారి డబ్ల్యూటీసి ఫైనల్ లో అడుగుపెట్టింది. అయితే ఈసారి భారత్కు ప్రత్యర్థిగా పటిష్టమైన ఆస్ట్రేలియా ఉంది అని చెప్పాలి. ఎంతో అద్భుతమైన పోరాటం కొనసాగిస్తే తప్ప టీమ్ ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో గెలిచే అవకాశం లేదు అనడంలో సందేహం లేదు.


 ఇకపోతే ఇప్పటికే అటు ఇంగ్లాండ్ గడ్డపై అడుగు పెట్టిన టీమిండియా ప్రాక్టీస్ లో మునిగి తేలింది అన్న విషయం తెలిసిందే. ఇంగ్లాండులోని ఓవల్ మైదానం వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. నేటి నుంచి జూన్ 11వ తేదీ వరకు కూడా ఈ ఫైనల్ ఉండబోతుంది అని చెప్పాలి. కాగా నేడు మధ్యాహ్నం 3 గంటలకు డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే టీమిండియా ప్లేయర్స్ అందరూ కూడా ఒకవైపు ప్రాక్టీస్ లో చెమటోడుస్తూనే మరోవైపు ఒత్తిడిని దూరం చేసుకునేందుకు సహచర ఆటగాళ్లతో సరదాగా గడుపుతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక ఆసక్తికర వీడియోని పోస్ట్ చేశాడు. తెలుగు క్రికెటర్.. వికెట్ కీపర్ కం బ్యాట్స్మెన్ అయిన కేఎస్ భరత్ తో సరదాగా చిట్ చాట్ చేశాడు రవిచంద్రన్. ఇక ఈ వీడియోలో అశ్విన్ ఫుల్ జోవియల్ మూడ్లో కనిపించాడు. కేఎస్ భరత్ను తనకు తెలుగు భాష నేర్పించమని అడిగాడు. అయితే వీడియో ప్రారంభంలో భరత్ తన సహచరుడు అశ్విన్ ను ఆహ్వానిస్తూ ఉంటే.. భరత్ ని ఫోటోషూట్ అంటే భయపడుతున్నావా అంటూ అశ్విన్ అడిగాడు. అంతా మంచిగానే ఉందని అనుకుంటున్నావా అని అడిగాడు. దీనికి భరత్ నేను భయపడటం లేదని నిజంగా సవాల్ కోసం ఎదురుచూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తెలుగు అభిమానులకు ఒక సందేశాన్ని అందించాలి అంటూ భరత్ ని కోరాడు అశ్విన్. ఈ క్రమంలోనే తర్వాత భరత్ చెబుతుంటే అశ్విన్ ఇక భరత్ చెప్పిన విషయాన్ని తెలుగులో మాట్లాడాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: