
అయితే అందరికీ హీరోల్లాగా ఎంతో వినయంగా మాట్లాడటం కాదు.. ఇక తగనకు నచ్చిన విధంగా కాస్త బోల్డుగా మాట్లాడటం విజయ్ దేవరకొండ కి అలవాటు. అయితే ఈ బోల్డ్ నేస్ విజయ్ దేవరకొండ ని అందరి హీరోల్లోకెల్లా ప్రత్యేకంగా నిలిపింది. కానీ కొంతమందికి మాత్రం విజయ మాటలు అసలు నచ్చలేదు. దీంతో ఇక విజయ్ మాట్లాడే తీరుపై విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే గత కొంతకాలం నుంచి ఇలాంటి విమర్శలు చేసి ఇక కొత్త వివాదానికి తెరలేపింది యాంకర్ అనసూయ. ఏకంగా విజయ్ ని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టింది అన్న విషయం తెలిసిందే.
అభిమాన హీరోని టోల్ చేస్తే రౌడీ హీరో ఫ్యాన్స్ ఎలా ఊరుకుంటారు. ఇక అనసూయను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం కొన్ని కొన్ని సార్లు గీత దాటి విమర్శలు చేయడం కూడా చేశారు. అయితే ఇటీవల విజయ్ దేవరకొండ తో ఉన్న వివాదం గురించి అనసూయ తొలిసారి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. ఒక ఇంగ్లీష్ పత్రిక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విజయ్ తో నాకు చాలా రోజులుగా పరిచయం ఉంది. మంచి స్నేహితులం కూడా. అయితే అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఆయన ఒక థియేటర్‌కు వెళ్లి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇవి నన్ను ఎంతగానో బాధించాయి. ఇలాంటివి మాట్లాడొద్దు అని మాత్రమే నా అభిప్రాయం చెప్పాను..కానీ నాపై ట్రోల్స్ వచ్చాయి. ఇకనుంచి ఇది ఇక్కడితో ఆపేయాలని అనుకుంటున్నా అంటూ అనసూయ తెలిపింది.