ప్రస్తుతం వరల్డ్ క్రికెట్లో ఉన్న అద్భుత స్పిన్నర్ల గురించి చర్చ వచ్చింది అంటే ముందుగా ఆ భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరే మొదట వినిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే భారత జట్టు తరఫున దాదాపు దశాబ్ద కాలానికి పైగానే ప్రాతినిధ్యం వహిస్తున్న రవిచంద్రన్ అశ్విన్ తన స్పిన్ తో ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు అని చెప్పాలి. అంతేకాదు ఇక వరల్డ్ క్రికెట్లో తెలివైన బౌలర్ గా కూడా కొనసాగుతున్నాడు రవిచంద్రన్ అశ్విన్ కొనసాగుతున్నాడు.


 ఏ బ్యాట్స్మెన్ కి ఎక్కడ బంతి వేయాలి అన్న విషయం అతనికి బాగా తెలుసు. అంతేకాదు బ్యాట్స్మెన్లు కాస్త ఓవరాక్షన్ చేస్తే మన్కడింగ్ ద్వారా అవుట్ చేయడం కూడా అటు అశ్విన్ కి బాగా అలవాటు. ఇలా ఇప్పటికే తన అటతీరుతో ఎన్నోసార్లు వార్తల్లో నిలిచాడు రవిచంద్రన్ అశ్విన్. అరుదైన రికార్డులు కూడా కొలగొట్టి ప్రస్తుతం ఐసీసీ ప్రకటించే టెస్ట్ బౌలర్ల జాబితాలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. వెస్టిండీస్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో కూడా ఆడుతున్న అశ్విన్.. మరోసారి తన స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ చేశాడు.


 అశ్విన్ దెబ్బకు కరేబియన్ బౌలర్లు అందరూ కూడా వరుసగా పెవిలియన్ క్యూ కట్టారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డు కూడా కొల్లగొట్టాడు రవిచంద్రన్ అశ్విన్. ఐదు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ క్రమంలోనే అన్ని ఫార్మట్లలో కలిపి ఏ విధంగా 700 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన మూడో ఇండియన్ బౌలర్గా ఓవరాల్ గా.. 16వ బౌలర్గా రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. భారత తరఫున అనిల్ కుమార్ 401 మ్యాచ్లలో 953 వికెట్లతో తొలి స్థానంలో ఉండగా.. హర్భజన్ 402 మ్యాచ్ లలో 707 వికెట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. అశ్విన్ 700 వికెట్లతో మూడో స్థానంలో నిలిచాడు అని చెప్పాలి. అశ్విన్ ఇప్పటివరకు ఏకంగా 702 వికెట్లు పడగొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: