ధనశ్రీ మాట్లాడుతూ డ్యాన్స్ నేర్చుకునే విషయంలో చాహల్ ఎంతో ఉత్సాహం, శ్రద్ధ కనబర్చేవాడు. నాకది నచ్చింది. అనేక విషయాల్లో అతనిలా ఎవరూ ఉండలేరు’ అని పేర్కొంది. జీవిత భాగస్వామి విషయంలో ఆప్షన్లను వెతుక్కోవడం.. ఎంతోమందిని కలవడం వంటివి చేస్తున్న ప్రస్తుత తరంలో.. నేరుగా పెళ్లి ప్రస్తావన తీసుకురావడం సానుకూల ముద్ర వేసింది. పెళ్లి విషయంలో నాపై ఎప్పుడూ ఒత్తిడి లేదు. జీవితంలో చాలా సంతోషంగా ఉన్నా. అంతా బాగుంది’ అని చెప్పింది. అయితే, చాహల్ పరిచయమైనప్పుడు అతను ఎవరనేది తెలియదని.. అతను టీమ్ ఇండియా జట్టులో అరంగేట్రం చేసేనాటికి తాను క్రికెట్ చూడటం మానేసినట్లు ధనశ్రీ పేర్కొంది. చాహల్ కూడా తన ప్రేమ విషయాల్ని చెప్పేసాడు. ప్రేమ, డేట్ అని కాకుండా డైరెక్ట్ గా పెళ్లి చేసుకుంటానని చాహల్ ప్రపోజ్ చేసాడంట. డ్యాన్స్ క్లాస్ లో పరిచయమైన ఈ ఇద్దరి కథ పెళ్ళికి ఇలా వెళ్ళిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంతే కాదు ధోని-సాక్షిల లవ్ స్టోరీని కూడా అందరు గుర్తుచేసుకుంటున్నారు. ధోని సినిమాలో ధోని, సాక్షి ముందు ఎలా పరిచయమ్మారో చూపించిన విషయం అందరికి తెలిసిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి