కాగా ఈ విజయంతో అటు భారత జట్టు సెమీఫైనల్ లో అడుగు పెట్టింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే సెమీఫైనల్ లో బంగ్లాదేశ్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం టీమిండియా జోరు చూస్తే తప్పకుండా ఎమర్జింగ్ ఆసియా కప్ లో టైటిల్ విజేతగా నిలుస్తుందని భారత క్రికెట్ ప్రేక్షకులు కూడా బలంగా నమ్ముతూ ఉన్నారు అని చెప్పాలి. కాగా నేడే ఈ టోర్నీలో భాగంగా భారత్ జట్టు బంగ్లాదేశ్ తో సెమీఫైనల్ మ్యాచ్ ఆడబోతుంది. యష్ దుల్ నేతృత్వంలో భారతీయ జట్టు బరిలోకి దిగిపోతుంది అని చెప్పాలి.
కాగా భారత జట్టులో ఛాన్స్ దక్కించుకున్న యంగ్ ప్లేయర్స్ అందరూ కూడా అద్భుతమైన ఫామ్ లో కనిపిస్తున్నారు. అన్ని విభాగాల్లో కూడా రానిస్తూ ఉన్నారు. దీంతో వరుస విజయాలతో టీమిండియా ఏ జట్టు దూసుకుపోతుంది అని చెప్పాలి. అయితే అటు బంగ్లాదేశ్ జట్టు శ్రీలంక చేతిలో ఓడిపోయినప్పటికీ ఓమన్, ఆఫ్ఘనిస్తాన్ పై గెలవడంతో చివరికి సెమి ఫైనల్లో అడుగుపెట్టింది అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ లో బంగ్లా సీనియర్ ప్లేయర్ సౌమ్య సర్కార్ సత్తా చాటాలని భావిస్తూ ఉన్నాడు. కాగా ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకి ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది అని చెప్పాలి. ఈ సెమి ఫైనల్ మ్యాచ్ కోసం భారత అభిమానులు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి