
ఇలా ఇటీవల కాలంలో టీమిండియాలో అదిరిపోయే ప్రదర్శన చేసి తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్. జట్టులోకి వచ్చిన కొత్తలో కాస్త విమర్శలు ఎదుర్కున్నప్పటికీ.. ఆ తర్వాత మాత్రం ఇక తన బౌలింగ్ ను మరింత మెరుగుపరుచుకుని జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. అయితే ఇక ఇప్పుడు మరో యంగ్ ప్లేయర్ టీమ్ ఇండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు తరఫున మంచి ప్రదర్శన చేస్తూ అదరగొట్టాడు తిలక్ వర్మ. నిలకడైన ఆటతీరుతో సెలెక్టర్ల చూపును ఆకర్షించాడు. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ఫ్యూచర్ స్టార్ అని అందరిలో నమ్మకాన్ని కలిగించాడు.
ఇక టీమ్ ఇండియాలోకి వచ్చి జాతీయ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాలి అనే కలను నిజం చేసుకున్నాడు. వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో తుది జట్టులో ఛాన్స్ దక్కించుకున్న తిలక్ వర్మ.. మొదటి మ్యాచ్ లోనే మంచి ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఏకంగా తాను ఎదుర్కొన్న రెండో బంతిని సిక్సర్ గా మలిచి పరుగుల ఖాతాను తెరిచాడు ఈ హైదరాబాద్ క్రికెటర్ ఆ తర్వాత బంతికి మరో సిక్స్ కొట్టి వావ్ అనిపించాడు. ఇలా మంచి ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ మొదటి మ్యాచ్ లో 22 బంతుల్లో మూడు సిక్సర్లు రెండు ఫోర్ లతో 39పరుగులు చేశాడు.